Love Reddy Movie Rating: 2.75/5
నటీనటులు: అంజన్ రామచంద్ర,
శ్రావణి కృష్ణవేణి, జ్యోతి మదన్,
పల్లవి పర్వా, వాని చన్నన్‌రార్యపతన్ తదితరులు
రచన, దర్శకత్వం: స్మరణ్ రెడ్డి
నిర్మాతలు నాగరాజ్ బీరప్ప, హేమలత రెడ్డి,
మదన్ గోపాల్ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రభాజన్ రెడ్డి, సునంద బీ రెడ్డి తదితరులు
మ్యూజిక్: ప్రిన్స్ హ్యారీ
సినిమాటోగ్రఫి: శివ శంకర వర ప్రసాద్, మోహన్ చారి, అష్కర్ ఆలీ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: బీఎస్ రమేష్ కుమార్
బ్యానర్: గీతాంశ్, సెహెరీ, ఎంజీఆర్
రిలీజ్ డేట్: 2024-10-17

 

ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులోని ఓ గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి అలియాస్ లవ్ రెడ్డి గార్మెంట్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్. ఆ ప్రాంతంలో ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లో పనిచేసే దివ్య (శ్రావణి కృష్ణవేణి) తొలిచూపులోనే ప్రేమించి.. ఆమె ఊహల ప్రపంచంలో బతుకుతుంటాడు. ఈక్రమంలో వారిద్దరూ క్లోజ్ అవుతారు? లవ్ రెడ్డి మాత్రం ఓ రోజు తన మనసులో ఉన్న ప్రేమను దివ్యకు చెప్పేస్తాడు. అయితే ఆ ప్రపోజల్‌ను ఒప్పుకోకుండా కొన్ని షరతులు విధిస్తుంది.
దివ్యను తొలిసారి చూసిన తర్వాత నారాయణ రెడ్డికి జరిగిన పెళ్లిచూపుల్లో ఏం జరిగింది? నారాయణరెడ్డి వెంట స్వీటి (జ్యోతి మదన్) ఎందుకు పడింది? నారాయణ రెడ్డి, దివ్య ఒకరికొకరు ఎలా దగ్గరయ్యారు? తన లవ్ ప్రపోజల్‌ను చెప్పిన తర్వాత దివ్య విధించిన కండిషన్ ఏమిటి? ఈ ఇద్దరి ప్రేమకథకు ముగింపు ఏమిటి? నారాయణ రెడ్డి పేరు లవ్ రెడ్డిగా ఎందుకు మారింది అనే ప్రశ్నలకు సమాధానమే లవ్ రెడ్డి సినిమా కథ. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో అక్కడి నేటివిటీని జొప్పించి దర్శకుడు స్మరణ్ రెడ్డి రాసుకొన్న పాయింట్‌ రెగ్యులర్ లవ్ స్టోరీగా అనిపిస్తుంది. కానీ ఆ రొటీన్ పాయింట్‌ చుట్టూ అల్లుకొన్న ఫ్యామిలీ డ్రామా, లవ్, ఎమోషన్స్ చక్కగా కుదిరాయి. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి అవుట్‌పుట్‌ను తెరపైకి తెచ్చిన తీరు ఆయన ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు గుండెను పిండేసే ఎమోషన్స్‌తో కథను చెప్పిన విధానంతో ఆయన సక్సెస్ సాధించారనే చెప్పవచ్చు.

ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ మూవీలో టార్చ్ వేసి వెతికినా కొత్త ముఖం కనిపించదు. కానీ రెండు గంటలపాటు స్టోరీతో ట్రావెల్ అయ్యేలా, ఎమెషన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ప్రతీ ఒక్కరు నటించిన తీరు సినిమాపై ఉన్న తపన, అభిరుచి చెబుతాయి. నారాయణ రెడ్డి అలియాస్ లవ్ రెడ్డిగా అంజన్ రామచంద్ర పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా మూవీ భారాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. ఆయన కొత్త నటుడంటే నమ్మని విధంగా ఫెర్ఫార్మెన్స్ చూపించాడు. ఇక దివ్యగా శ్రావణి నటన ఈ సినిమా మరో స్పెషల్ ఎట్రాక్షన్. అంజన్, శ్రావణి ఇద్దరు కలిసి ఓ డిఫరెంట్ కెమిస్ట్రీని, ఫీల్ గుడ్ మూమెంట్స్‌ను పండించారు. ఇక ఈ చిత్రంలో దివ్య తండ్రిగా నటించిన ఎన్‌టీ రామస్వామి ఈ సినిమా చివర్లో గ్రాఫ్‌ను పెంచేలా చేశారు. కన్నడ టెలివిజన్ యాక్టర్‌గా సుపరిచితులైన ఆయన చివరి 20 నిమిషాలు కథలోకి భావోద్వేగాన్ని, ఇంటెన్సిటీని తీసుకొచ్చేలా నటించారు. జ్యోతి మదన్ సున్నితమైన హాస్యాన్ని పండించింది. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు కథకు, సినిమాకు, వారి పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్ ఈ సినిమాకు ఓ బలంగా చెప్పుకోవచ్చు. పాటలు మాత్రమే కాదు.. పలు సన్నివేశాలను ఎమోషనల్‌గా మలచడంలోను, కొన్ని సీన్లను ఎలివేట్ చేయడంలో సంగీత దర్శకుడు ప్రిన్స్ తన టాలెంట్‌ను చూపించాడు. ఇక చిక్‌బళ్లాపూర్‌, తదితర ప్రాంతాల్లో జరిగే ఈ ప్రతీ సీన్‌కు నేటివిటితో చూపించడంలో సినిమాటోగ్రాఫర్లు ప్రత్యేక శ్రద్ద చూపించారు. కీలక సన్నివేశాల్లో డైలాగ్స్ సినిమాకు మరింత కనెక్ట్ అయ్యేలా చేశాయి. కథ, నటీనటుల ఎంపిక చూస్తే నిర్మాతలకు సినిమాపై ఉన్న అభిరుచి కనిపిస్తుంది. మూవీని రిచ్‌గా చూపించడంలో వారు పాటించిన నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి.

ఫైనల్‌గా కన్నడ, తెలుగు సరిహద్దులో ఉండే ఓ ప్రత్యేకమైన యాస ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. లవ్, ఎమోషన్స్‌, నేటివిటీతో రూపొందిన ఈ సినిమాను చూస్తున్న సేపు కొత్త అనుభూతిని పంచుతుంది. క్లైమాక్స్ మాత్రం భావోద్వేగాలతో హృదయాన్ని తట్టి లేపుతుంది. అయితే రొటీన్, కథ, సింగిల్ పాయింట్ మీద స్టోరీని నడిపించడం కొత్తదనం కోరుకొనే వారికి కొంత నిరాశగా కలిగించే అవకాశం ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఓ ఫ్రెష్, నిజాయితీతో చెప్పే కథ తప్పకుండా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. గ్రామీణ నేపథ్యంతో ప్రేమ కథలను ఇష్టపడే వారికి డెఫినెట్‌గా నచ్చుతుంది. ఈ వారాంతంలో చిన్న సినిమాను మిస్ చేసుకోకండి.

 

Love Reddy Movie Rating: 2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *