“ఏమంటారు గ్యాంగ్? గిన్నెలు మస్తు వేడెక్కాలని ఆశపడ్డాం కానీ.. ఈ ప్రతాప్ గాడి లొల్లి చూస్తుంటే మనమే పొయ్యి మీద కూర్చున్నంత చిరాకు దొబ్బుతుంది! తిరువీర్ భాయ్ అంటే ఏదో ‘మసూద’ లెవల్ సరుకు ఉంటుందని థియేటర్ కి పోతే.. ఆయన మనల్ని సినిమాతో కాదు కదా, ఏకంగా సీటుతోటి గుద్ది గుద్ది కొడుతున్నట్టు అనిపించింది.

దీనికి తోడు ఈ సినిమా వెనుక ఉన్న ఆ పెద్ద బ్రాండ్ ఒకటుంది.. ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అనుకుంటే, వాళ్లు తీసిన ఈ ‘నమూనా’ మాత్రం గుండె ఆగిపోయేలా ఉంది! వాళ్ల స్టాండర్డ్ ఎక్కడ.. ఈ ప్రతాప్ గాని గోస ఎక్కడ బాసూ?

ముచ్చట ఏందంటే.. ఈ ప్రతాప్ (తిరువీర్) కి బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ) అంటే పిచ్చి. సరే పెళ్లి చేసుకున్నాడు.. కానీ పెళ్లైన మూడు రోజులకే బుజ్జమ్మ బట్టలు సర్దుకొని ఉరికింది! ఆ ‘సమస్య’ ఏందో మొగునికి చెప్పదు, అత్త అయిన మన రాశి మేడమ్ కి చెప్పదు, తండ్రి అయినా దేవి ప్రసాద్ కి అస్సలే చెప్పదు. ఆ సమస్య ఏందో ప్రతాప్ గాడే ‘సిఐడి’ లాగా కనిపెట్టాలంట. అరేయ్.. వాడు ఆ చిక్కుముడి విప్పే లోపు ఇక్కడ ఆడియన్స్ కి ప్రేగులు మెలితిరిగి ప్రాణాలు పోతున్నాయి బిడ్డ! నటీనటుల టార్చర్ అయితే ఇలా ఉంది: తిరువీర్: అమాయకంగా మూతి పెట్టి చూస్తూనే టార్చర్ కి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ లా తయారయ్యాడు. అజయ్ ఘోష్: ఈయనది ‘గోస’ కాదు.. ఆ వేషాలు చూస్తుంటే మనకు అసలైన ‘గొస’ పుడుతుంది. ఎందుకు అరుస్తున్నాడో.. ఎందుకు కొట్టుకుంటున్నాడో ఆయనకే ఎరుక! పాయల్ రాధాకృష్ణ: సమస్య ఏందో సెప్పదు.. సినిమా అయిపోయే దాకా థియేటర్ గుమ్మం కదలనివ్వదు! గోపరాజు రమణ, రఘుబాబు: వీళ్లిద్దరూ ఉంటే కడుపుబ్బ నవ్వాలి.. కానీ ఇందులో వీళ్ల సీన్లు చూస్తుంటే కడుపులో తిప్పినట్టు అవుతుంది. వీళ్లు కూడా ఆ నరకంలో భాగస్వాములే! శ్రీనివాస్ అవసరాల: అసలు ఈయన ఈ సినిమాలో ఎందుకు ఉన్నాడో.. ఆ దేవుడికైనా ఎరుకో కాదో కానీ, మనకైతే అర్థం కాలేదు! ప్రసాద్ బెహరా, బాషా, రవి ఆంటోని, అనంత్ బాబు: వీళ్లంతా కలిసి చేసే ఆ ‘విలేజ్ పంచాయతీ’ ఉందే.. అబ్బో! అది చూస్తుంటే ‘పాపం ప్రతాప్’ కాదు, ‘పాపం జనాలు’ అని తల గోడకేసి బాదుకోవాలనిపిస్తుంది.

అసలు ఆ డైరెక్టర్ బాబు ఆ షకీలా మేటర్ ఎందుకు తెచ్చారు బాసూ? ఇది ఫ్యామిలీతో చూసే బొమ్మనా లేక బి-గ్రేడ్ సెటప్పా? వాళ్లకే క్లారిటీ లేదు! ఆ పంచాయతీ పెద్దలకి సీరియస్ లేదు, కథలో సరుకు లేదు.. ఆ సాగదీత చూస్తుంటే మనం 2040 లో కూడా ఈ ప్రతాప్ గాని పంచాయతీలోనే చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. ‘రియల్ ఇన్సిడెంట్’ అన్నారు.. కానీ అది నిజంగా ఎవరికైనా జరిగి ఉంటే వాళ్లు ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి ఉంటారు! క్షమించాలి.. నన్ను మరి

ఫైనల్ గా అసలు ముచ్చట :-
టైటిల్ ‘పాపం ప్రతాప్’ అని పెట్టారు కానీ.. సినిమా చూసి బయటకొచ్చిన ప్రతి ఒక్కడు ‘పాపం ప్రేక్షకులు.. పగిలినయి గిన్నెలు’ అనుకుంటున్నారు! అజయ్ ఘోష్ ది గోస కాదు.. మనది అసలైన గొస! ఈ వారం మనకి ఇది అస్సలు సెట్ అవ్వదు. సమస్య ప్రతాప్ కి కాదు.. ఈ సినిమా కి వచ్చిన వాళ్లకి ఉందేమో అనిపిస్తుంది. మనల్ని ఇంతగా కష్టపెట్టినందుకు డైరెక్టర్ కి ఒక పెద్ద దండం! ఇది నా వివరణ.. మీ వివరం ఎట్లా ఉందో సినిమా చూసి చెప్పు, కింద కామెంట్ కొట్టు.. లేదు అంటే ఒట్టు! పోనీ ఒక ఫాలో కొట్టు.. ఏమంటారు గ్యాంగ్.. గిన్నెలు వేడెక్కుతాయనుకుంటే, అసలు పొయ్యే ఆరిపోయింది! ఈ వారం ‘పాపం ప్రతాప్’ ని పక్కన పెట్టేసి మొక్కు తీర్చుకుందాం! మరో పక్కన ఈ వారం ఇంకా 3 సినిమా లు ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం… గెట్ రెడీ! ” ఈ వారం మీరు ఏ సినిమా చూస్తారో కామెంట్ కొట్టండి ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *