విడుదల తేదీ : జూన్ 14, 2019

సినిమిర్చి .కామ్ రేటింగ్ :3/5

నటీనటులు : సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

దర్శకత్వం : అరుణ్ పవర్

నిర్మాత : నరేంద్ర, జీవిఎన్ రెడ్డి

సంగీతం : బుల్గానియన్

స్క్రీన్ ప్లే : అరుణ్ పవర్

సినిమా కథ :

సప్తగిరి (గోవింద) తన ఊరి జనం వరుసగా క్యాన్సర్ తో చనిపోతుండటాన్ని జీర్ణయించుకోలేకపోతాడు. ఎలాగైనా తన ఊరి జనాన్ని కాపాడటానికి చేసే ప్రయత్నంలో ‘ఎమ్ఎల్ఏ’ లక్ష్మి ప్రసన్న (అర్చన శాస్త్రీ) చేతిలో దారుణంగా మోసపోతాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం సప్తగిరికి తన ఊరి ప్రజలను కాపాడుకోవడానికి ‘నిధి’ రూపంలో మరో అవకాశం వస్తోంది. అయితే నిధి కోసం వెతికే ప్రయత్నంలో రౌడీల చేతిలో చిక్కుకుంటాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల తరువాత సప్తగిరి రౌడీల నుండి ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? అసలు సప్తగిరికి నిధి దొరికిందా ? తన ఊరి ప్రజల కష్టాలను తీర్చాడా ?ఇంతకీ రౌడీల నుండి తప్పించుకోగలిగాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సప్తగిరి
వైభవ్ జోషి
శ్రీనివాసరెడ్డి టీం
మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
ఫోటోగ్రఫీ
డైరెక్షన్

సినిమా సాంకేతిక విభాగం :
దర్శకుడు అరుణ్ పవర్ పేపర్ మీద రాసుకున్న స్క్రిప్ట్ ను, స్క్రీన్ మీదకు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆయన రాసుకున్న కథకథనాల్లో సహజత్వం కూడా లోపించింది. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది.
బుల్గానియన్ అందించిన పాటల్లో ఓ పాట ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగింది. ఎడిటర్, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగానే ఉన్నాయి.

చివరి తీర్పు :

సప్తగిరి నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన్నప్పటికీ.. కన్వీన్స్ కానీ ట్రీట్మెంట్ !