సిద్ధార్ధ‌, కేథ‌రిన్ జంట‌గా సాయిశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తమిళంలో రూపొందిన ‘ఆరువం’ అనే చిత్రం తెలుగులో ‘వ‌ద‌ల‌డు’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పారిజాత క్రియేష‌న్స్ ప‌తాకంపై టి. అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో టి. న‌రేష్‌కుమార్‌, టి. శ్రీ‌ధర్ నిర్మాత‌లుగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో జ‌రిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ప్ర‌ముఖ రాజ‌కీయ వేత్త మ‌న్నే గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రించారు. మ‌రో ముఖ్య అతిధిగా ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మ‌న్నే గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అంజ‌య్య‌గారు ఈ సంవ‌త్స‌రంలో నాలుగు చిత్రాలు విడుద‌ల చేశారు. తెలుగు ఇండ‌స్ట్రీలో దిల్‌రాజు త‌ర్వాత అంత పెద్ద ప్రొడ్యూస‌ర్‌గా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను. ఇంకా ఆయ‌న ఎన్నో మంచి చిత్రాలు తీయాలని సినిమాలపై మ‌క్కువ పెంచుకుని చేయాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ కేథ‌రీన్ విష‌యానికి వ‌స్తే స‌రైనోడు చిత్రంలో ఒరిజ‌న‌ల్ ఎంఎల్ఎ కంటే ఆమెకు ఎక్కువ పేరు వ‌చ్చింది. అంత మంచి పాత్ర‌లో ఆమె న‌టించారు. అంజ‌య్య‌గారిలాంటి ఇంత మంచి ప్రొడ్యూస‌ర్ తెలంగాణ‌లో ఉండ‌డం చాలా అనందంగా ఉంది. సిద్ధార్ధ త‌మిళ ప్రేక్ష‌కుల‌కు కొత్తగానీ, మ‌న తెలుగువారికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చెయ్య‌క్క‌ర్లేదు..’’ అని అన్నారు.
న‌ట్టికుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా గురించి నేను చెప్ప‌డం కాదు ఇది ఒక డిఫ‌రెంట్ మూవీ. ఇప్ప‌టివ‌ర‌కు కేథ‌రిన్ చేసిన మూవీస్ అన్నీ స‌క్సెస్ సాధించాయి. ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది. ఈ బ్యాన‌ర్‌లో ఏ సినిమా చేసినా అన్నీ హిట్ అవుతున్నాయి. ఈ బ్యాన‌ర్ ఇంకా ఎద‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిల్‌రాజుగారు త‌ర్వాత పారిజాత అంజ‌య్య‌గారు అంత పెద్ద ప్రొడ్యూస‌ర్‌గా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను..’’ అన్నారు.