మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టీరియస్” (MissTerious) తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్, అబిద్ భూషణ్ ( నాగభూషణం మనవడు), రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో త్వరలో విడుదలకు సిద్దమవుతుంది.

ఉష మరియు శివాని సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ (Ashley Creations) బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది, ఆడియో లాంచ్ త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది.

దర్శకుడు మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ మిస్టీరియస్ చిత్రం ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా నిర్మించాము. చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే సునిశితంగా రూపొందించిన ఈ చిత్రం క్రమక్రమంగా క్లూలను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ చిత్రం షాకింగ్ ట్విస్ట్ లు కథను కొత్త ఎత్తులకు తీసుకెల్లి వీక్షకులను రంజింప చేస్తుంది, యాక్షన్స్, థ్రిల్లింగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి అని వివరించారు.

చిత్రాన్ని ఉన్నత విలువలతో రూపొందించడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నిర్మాతను ఆయన అభినందించారు.

నిర్మాత జయ్ వల్లందాస్ (USA) మాట్లాడుతూ, ఎక్కడ రాజీ పడకుండ నిర్మిస్తున్న ఈ సినిమాలో మూడు మంచి పాటలు ఉన్నాయని, సంగీత దర్శకుడు M.L రాజా మధురమైన సంగీతాన్ని అందించారని త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామని చెప్పారు.
క్లైమాక్స్ వరకు ఉత్కంఠను నింపడం ఈ చిత్రం మాస్టర్ క్లాస్ అని అన్నారు.
మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం ప్రత్యేకం
అని అన్నారు.

ఈ చిత్రం ఆడియో లాంచ్ తర్వాత త్వరలో విడుదల కానుంది.

నటీనటులు : ప్రధాన తారాగణం:
రోహిత్ (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్ (హీరోయిన్), అబిద్ భూషణ్ (ప్రముఖ నటుడు రక్త కన్నీరు నాగభూషణ్ మనవడు), మేఘనా రాజపుత్ (హీరోయిన్), బలరాజ్ వాడి (కన్నడ నటుడు), ఆకునూరి గౌతమ్,భోగిరెడ్డి శ్రీనివాస్, రాజమౌళి(జబర్దస్త్), గడ్డం నవీన్ (జబర్దస్త్), లక్ష్మి,,వేణు పోల్సాని

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి
నిర్మాత: జయ్ వల్లందాస్ (USA)

పాటలు మరియు సంగీతం: ML రాజా
కెమెరా & ఎడిటింగ్: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్ ఉప్పు
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other Story