ఎంగేజింగ్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ‘కళింగ’

0

SHARES

ఎంగేజింగ్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ‘కళింగ’

యువ కథనాయకుడు ధృవ వాయు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కింది. ఇందులో ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటించింది. ఆడుకాలం నరేన్, సంజయ్ కృష్ణ, లక్ష్మణ్ మీసాల, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్, హారర్, థ్రిల్లర్ బేస్ తో తెరకెక్కిన ఈ చిత్రం… ఆడియన్స్ ఏమాత్రం అలరించిందో సినిమా సమీక్షలో తెలుసుకుందాం పదండి.

కథ: కళింగ రాజ సంస్థానంలో మనుషులు చాలా వింతగా ప్రవర్తిస్తూ వుంటారు. దానికి ఓ పురణగాథ వుంటుంది. దాని ఆధారంగా బేస్ చేసుకుని ఈ కథను ప్రస్తుత కాలంలో… ఓ దట్టమైన అడివిలోని ఓ కు గ్రామంలో సాయంత్రం ఆరుగంటలు అయితే చాలు ఆ గ్రామ పొలిమేర వైపు గ్రామస్తులు కన్నెత్తి కూడా చూడరు. అలాగే ఎవరైనా చనిపోతే… కూడా వారిని ఆ ఊళ్లో పాతి పెట్టకుండా ఆ పొలిమేర సరిహద్దుల్లోనే వదిలేసి వచ్చేస్తుంటారు. ఇదే గ్రామంలో లింగ(ధ్రువ వాయు) తన మిత్రుడి(లక్ష్మణ్ మీసాల)తో కలిసి సారా కాస్తూ… అమ్ముకుంటూ బతుకుతుంటాడు. అయితే లింగ… అదే గ్రామానికి చెందిన పద్దు(ప్రగ్య నయన్)ని ప్రేమిస్తూ ఉంటాడు. ఊళ్ళో పటేల్(ఆగుగలం నరేన్)ఊళ్లోని ప్రజలకు పొలాలను తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బులిస్తుంటాడు. జనాలు తిరిగి డబ్బు చెల్లించినా… వాళ్లకు పొలాలు మాత్రం తిరిగి అప్పజెప్పడు. ఎవరైనా ఎదురుతిరిగి అడిగితే… అదే వాళ్లకు చివరి రోజు అయ్యేలా చేస్తాడు పటేల్ తమ్ముడు(బలగం సంజయ్). లింగకి పద్దు పెళ్లి కావాలంటే పటేల్ దగ్గర ఉన్న లింగ పొలం విడిపించుకొమ్మని పద్దు నాన్న(మురళీధర్ గౌడ్) కండిషన్ పెడతాడు. అప్పటికే లింగకు, పటేల్ తమ్ముడికి పద్దు విషయంలో గొడవలు ఉంటాయి. లింగ వెళ్లి పొలం అడగడంతో అతని రెండెకరాల పొలం బదులు అడవిలో నాలుగెకరాల పొలం ఇస్తాను అని పొలిమేర వైపు ఉన్న పొలం ఇస్తాడు పటేల్. లింగ చిన్నప్పట్నుంచి అడవిలోకి వెళ్లి వస్తూ ఉన్నా అతనికి ఏం కాదు. దీంతో లింగ, అతని ఫ్రెండ్ ఆ పొలం కోసం పొలిమేర దాటి అడివిలోకి వెళ్తారు. అలా వెళ్లిన ఇద్దరు మళ్ళీ తిరిగి వచ్చారా? పద్దుతో లింగ పెళ్లి జరిగిందా? అసలు అడివిలో ఏం జరుగుతుంది? రాజ సంస్థానంలో ఎందుకు మనుషులు అలా వింతగా ప్రవర్తిస్తుంటారు? రాజసంస్థానానికి ప్రస్తుతం అడవిలో ఉన్న ఆ కుగ్రామానికి ఏమిటి లింకు? అసలు కళింగ రాజుల కథేంటి? లింగ అడవిలోకి దేని కోసం వెళ్ళేవాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: పురాణాలను, చరిత్రను బేస్ చేసుకుని రాసుకున్న కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. వాటిని నేటితరం ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఇలాంటి స్టోరీస్ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ ఫామ్ చేశాయి. అందులో ప్రేక్షకులను కట్టిపడేసే స్క్రీన్ ప్లే వుంటే చాలా ఆడియన్స్ ను రెండుగంటల పాటు ఎంగేజ్ చేసేయొచ్చు. రాజులు… రాక్షసులు… ప్రస్తుత వర్తమాన కాలంలో వారికి లింక్ చేస్తూ కథ… స్క్రీన్ ప్లేను ఎంత గ్రిప్పింగ్ గా నడపగలిగితే… ఆ బొమ్మ వెండితెరపై హిట్టే. కళింగ సినిమా ఒక నిధి వేట కథని హారర్ జానర్ లో డివోషనల్ టచ్ ఇచ్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేసారు. అయితే సినిమా మొదట్లో, సెకండ్ హాఫ్ కాసేపు ఆల్మోస్ట్ 10 నిమిషాల పైన వాయిస్ ఓవర్ తో హిరణ్యకశ్యపునితో మొదలు పెట్టి… కళింగ దేశపు రాజుల చరిత్రతో ముగిస్తాడు. కథకు మూలమైన కీలక ఘట్టాలను ఇందులో వివరించారు. దాని ఆధారంగానే ఈ సినిమాని నడిపించారు.
ఫస్ట్ హాఫ్ అంతా పొలిమేర చూపించి భయపెడుతూనే హీరో – హీరోయిన్ లవ్ స్టోరీ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులని బాగానే భయపెట్టారు. దీంతో అసలు పొలిమేర అవతల అడివిలో ఏముంది అని ఆసక్తి ఆడియన్స్ లో పెరిగిపోతుంది. అలాగే రాజసంస్థానం కథను నేటి వర్తమానానికి లింక్ చేయడానికి దర్శకుడు ఎలాంటి పాత్రలు ఎంచుకున్నాడనేది ఇందులో ఆసక్తికరం. ఫస్ట్ హాఫ్ లో తలెత్తిన ప్రశ్నలకు… సెకండ్ హాఫ్ లో ఒక్కొక్కటిగా రివీల్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులని భయపెట్టే స్కోప్ ఉంది. అయితే… ఆ రేంజ్ లో భయపెట్టే సన్నివేశాలేవీ కనిపించవు. సెకండ్ హాఫ్ లో అసలు కథని ఎక్కువగా నేరేషన్ లోనే చెప్పేయడంతో బోలెడు సందేహాలు వస్తాయి. ఇక క్లైమాక్స్ లో అమ్మవారు వచ్చినట్టు వేసే గ్రాఫిక్ సీన్స్, దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి హై ఫీల్ ఇస్తుంది. అలాగే చివరలో సీక్వెల్ కూడా వున్నట్టు ఓ చిన్న హింట్ ఇచ్చాడు.

ఈ చిత్రానికి అన్నీ తానైన నటుడు, దర్శకుడు ధ్రువ వాయు చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా చేశారు. ప్రగ్య నయన్ కూడా పల్లెటూరి అమ్మాయిగా చాలా హోమ్లీగా కనిపించి మెప్పించది. తన అందం,అభినయానికి కుర్రాళ్లు ఫిదా అయిపోతారు. ఆడుకాలం నరేన్, సంజయ్ కృష్ణ, లక్ష్మణ్ మీసాల, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్, అబ్దుల్ రషీద్.. తదితరులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు ఎంచుకున్న ప్లాట్ బాగుంది. అందుకు పురాణ గాథని… చరిత్రకు లింక్ చేసి చెప్పడం ఆడియన్స్ కు నచ్చుతుంది. అయితే… ఇందులో క్రూరంగా చూపించిన ఓ వింత ఆకారాన్ని అసుర బక్షి పేరుతో మొదట్లో బాగా భయపెట్టారు కానీ… క్లైమాక్స్ లో ఆ పాత్ర బాగా తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రధాన బలం… నేపథ్య సంగీతం. హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాల్సిన ఇన్ స్ట్రూమెంట్స్ ని బాగా వాడుకున్నాడు. దాంతో సాధరణ సన్నివేశాలు కూడా బాగా ఎలివేట్ అయ్యాయి. మూవీ విజువల్స్ కూడా చాలా క్వాలిటీగా వున్నాయి. అడవిలోని అందాలను చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించి విజయం సాధించారు. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *