ఫాంటసీ… మ్యాజికల్ అంశాల సమ్మిళతంతో తెరకెక్కిన ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ చిత్రం… టుక్ టుక్. ఫ్రెష్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘కోర్టు’చిత్రంలో నటించిన హర్ష రోషన్ తో పాటు కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు నటించారు. తెలుగులో ఆనంద్ దేవరకొండ నటించిన ‘పుష్ఫక విమానం’చిత్రలో ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించిన తెలుగమ్మాయి సాన్వీ మేఘన ఇందులో ఓ ప్రధాన పాత్రపోషించారు. ఆమెకు జోడీగా , నిహాల్ కోధాటి నటించారు. సి.సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చిత్రవాహిని మరియు ఆర్ వై.జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రీమియర్ ను ప్రదర్శించారు. ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం ఫాంటసీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: ఓ గ్రామంలో ముగ్గురు స్నేహితులు(హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) ఉంటారు. వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రాహాన్ని తమ ఇంటి వద్దనే పెట్టాలనుకుంటారు. అలాగైతే వినయక నిమజ్జనానికి ట్రాక్టర్ ను ఇవ్వనని ఆ గ్రామం పెద్ద అంటారు. దాంతో ఆ ముగ్గురు కుర్రాళ్లు కలిసి ఓ త్రిచక్ర వాహనాన్ని తయారుచేసి అందులోనే వినాయకున్ని ఊరేగించి నిమజ్జనం చేస్తారు. అయితే ఇక్కటే ఓ ట్విస్ట్ ఆ త్రిచక్ర వాహనం ఆ ముగ్గురికీ ఇస్తుంది. అదేంటంటే… ఈ ముగ్గురికీ తెలియకుండా ఆ వాహనం తనకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లిపోతూ… ఈ ముగ్గురు కుర్రాళ్లను కంగారు పెట్టేస్తూ వుంటుంది. దాంతో దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నానా అగచాట్లూ పడుతుంటారు. అదే క్రమంలో ఈ ముగ్గురు కుర్రాళ్లూ ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఆ త్రిచక్ర వాహనం ఏమాత్రం సహించదు. అది ఎలాగంటే… ఓ సారి ఈ ముగ్గురులో ఇద్దరు… ఓ అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీస్తూ వుంటే… ఆ త్రిచక్రవాహనం వెంటనే వారువున్న స్పాట్ కి వచ్చేసి వారిని వారిస్తుంది. తీసిన వీడియోను కూడా కెమెరాలో కనిపించకుండా చేస్తుంది. మరి ఈ త్రిచక్ర వాహనానికి ఎందుకు ఇలాంటి యూనిక్ లక్షణాలున్నాయి? అవి ఎవరి వల్ల వచ్చాయి? చివరకు ఆ త్రిచక్రవాహనం గురించి ఎలాంటి నిజాలు బటపడ్డాయి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: సినిమాలో వైవిధ్యమైన కంటెంట్ ఉంటే ప్రేక్షులు ఆదిరిస్తారు. ఇది అనేకసార్లు రుజువైంది కూడా. కథ… కథనంలో కొత్తదనం వుంటే చాలు భాషా భేదం లేకుండా సినిమాను ఆదరిస్తారు. అలాంటి దమ్మున్న జెన్యూన్ కంటెంట్ నచ్చితే చాలు… అవి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్‌లుగా నిలుస్తాయి. టుక్ టుక్ చిత్రం కూడా ఇలాంటి కోవకు చెందినదే. ఇలాంటి కాన్సెప్టు చిత్రాలు తెలుగులో రావడం చాలా అరదు అనే చెప్పొచ్చు. చాలా యూనిక్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కు ఓ సరికొత్త ఫాంటసీ థ్రిల్లింగ్ ను కలిగిస్తుంది. కొత్త కాన్సెప్ట్ కావడంతో ఆడియన్స్ రెండు గంటల పాటు బాగా ఎంగేజ్ అవుతారు.
ఫస్ట్ హాఫ్ లో ఆ ముగ్గురు స్నేహితులతో సరదా సరదాగా సన్నివేశాలను తెరమీద చూపించి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నించారు దర్శకుడు. త్రి చక్రవాహనంలో మహిమలున్నాయంటూ దేవుడి రూపాన్ని కల్పించి దాన్ని ఎలా సొమ్ము చేసుకోవచ్చనేది చూపించారు. గ్రామస్తులందరినీ నమ్మించడానికి వాళ్లు చేసే విన్యాసాలన్నీ చాలా ఫన్నీగా వుంటాయి. అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ… మరో కోణంలో సాగడం ప్రారంభమవుతుంది. దాంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగిపోతుంది. సెకెండాఫ్ పై హైప్ క్రియేట్ అవుతుంది.
అందుకు తగ్గట్టుగానే సెకెండాఫ్ లో శాన్వి మేఘన, నిహాల్ కోధాటి పాత్రలు ఎంటర్ అయి… హాయిగా ఫీల్ గుడ్ మ్యూజిక్ అండ్ లవ్ స్టోరీతో ముందుకు సాగుతుంది. సెకెండాఫ్ మొత్తం శాన్వీ మేఘన పాత్రనే నడిపిస్తుంది. సెకెండాఫ్ లో మ్యూజిక్ కూడా ప్రధాన రోల్ పోషిస్తుంది. గతంలో వచ్చిన ఆనంద్ దేవరకొండ ‘పుష్ఫక విమానం’మూవీలో ఎలాగైతే తన నటనతో ఆకట్టుకుందో… ఇందులో కూడా పల్లెటూరిలో పెరిగిన ఓ పెంకి పిల్లపాత్రలో ఆమాయకంగా చాలా ఒదిగిపోయి నటించింది. ఆమె రీసెంట్‌గా తమిళంలో నటించిన ‘కుడుంబస్తాన్’ ఎంతో పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
ఈ చిత్రంలో వెహికల్‌లో ఉన్న మ్యాజికల్ ఎలిమెంట్స్ కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. దాంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, ఫాంటసీ, థ్రిల్లింగ్ అన్ని అంశాలు ఉంటాయి. ప్రేక్షకులను రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేస్తాయి.ఎక్కడ కూడా బోర్ కొట్టదు.
ముగ్గురు కుర్రాళ్లూ పోటాపోటీగా నటించారు. అందరికీ ఈక్వల్ పాత్రను పోట్రెయిట్ చేశారు దర్శకుడు. శాన్వీ మేఘన పాత్ర బాగా గుర్తుండిపోతుంది. నటనలోనూ, పాటల్లోనే తన మార్కును చూపించింది. ఆమెకి జోడీగా నటించిన నిహాల్ కోధాటి పాత్ర కూడా పర్వాలేదు. ఇతర పాత్రల్లో నటించిన వారు తమ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
దర్శకుడు ఎంచుకున్న కథ… కథనంలో ఫ్రెష్ నెస్ వుంది. ఇలాంటి మ్యాజిక్ కథలను తెరమీద చూపించి మెప్పించడం అంత సులభం కాదు. ఎంతో హోమ్ వర్క్ చేస్తేగానీ అది సాధ్యపడదు. వెహికిల్ తో మ్యాజిక్ చేయించడం అంటే మామూలు విషయం కాదు. కొత్తదనం వున్న పాయింట్ ను బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను రెండున్నర గంటల పాటు బాగా ఎంగేజ్ చేస్తుంది. మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి ప్రధాన బలం. బీజీఎం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు. ఈ వారం ఓ ఫాంటసీ ఎలిమెంట్స్ వున్న చిత్రంతో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ పొందలనుకునేవారికి ‘టుక్ టుక్’ బెస్ట్ ఛాయిస్. గో అండ్ వాచ్ ఇట్.
సినీ మిర్చి .కామ్ రేటింగ్: 3 /5