దాదాపు 5 ఏళ్ల పాటు షూటింగ్ చేసిన సినిమా ఇది. ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ టైం పీరియాడికల్ స్టోరీతో చేసిన ఈ మూవీ ప్రీమియర్స్ షో ద్వారా ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది. భారీ బుకింగ్స్ రావడంతో సినిమాపై హైప్ పెరిగిపోయింది.

కథ :
సినిమా 16వ శతాబ్దంలో జరిగే ఓ ఫిక్షనల్ స్టోరీ అని ముందే చెప్పారు. హరి హర వీరమల్లు (పవన్ కళ్యాణ్) వజ్రాలతో పాటు ఇతర దొంగతనాలు చేసి పేద ప్రజలకు పంచి పెట్టే దొంగ. అయితే, చిన్న దొర (సచిన్ కేడ్కర్) తన దగ్గర ఉన్న వజ్రాలను గోల్కొండ నవాబులకు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ముందే దొంగతనం చేసి తనకు ఇవ్వాలని వీరమల్లుతో చిన్న దొర డీల్ కుదుర్చుకుంటాడు. ఇక్కడే పంచమి (నిధి అగర్వాల్) పరిచయం అవుతుంది. వజ్రాలతో పాటు పంచమిని కూడా అక్కడ నుంచి వీరమల్లు తప్పించాలి. ఈ క్రమంలో గోల్కొండ నవాబులకు వీరమల్లు దొరికిపోతాడు.

అప్పుడు గోల్కొండ నవాబు… ఢిల్లీలో ఉన్న మొగల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ఉన్న నెమలి సింహాసనంలో ఉన్న కోహినూర్ డైమాండ్‌ను దొంగలించి తనకు ఇవ్వాలని అంటాడు. దీనికి వీరమల్లు ఒప్పుకోవాల్సి వస్తుంది. వీరమల్లు దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు ? కోహినూర్ తీసుకురావడానికి వెళ్లిన వీరమల్లు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశాడు ? పంచమి ఎవరు ? అసలు వీరమల్లు ఎవరు ? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :
దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్‌ను సిల్వర్ స్క్రీన్ పై చూశారు అభిమానులు. అందులోనూ.. పీరియాడికల్ పాత్ర. మళ్లీ సనాతన ధర్మాన్ని రక్షించే పవర్ ఫుల్ పాత్ర. ఇంకేముంది.. సినిమాలో అభిమానులకు కావాల్సిన స్టఫ్ మొత్తం ఉన్నట్టే.

అందరూ ఇలానే అనుకున్నారు. డైరెక్టర్ జ్యోతికృష్ణ కూడా ఇదే అనుకుని సినిమాను తీర్చిదిద్దాడని అనిపిస్తుంది. ముందుగా స్టోరీ తీసుకున్న క్రిష్ జాగర్లమూడి కోహినూర్ నేపథ్యంలో కథ రాసుకున్నాడు. కానీ, జ్యోతికృష్ణ ఇప్పటి కాలానికి అనుకూలంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ కి, ఆయనకు ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా కథలో కాస్త మార్పులు చేర్పులు చేశాడు. అవి పవన్ అభిమానులకు, ఆయనను ఫాలో అయ్యే వారికి బాగానే నచ్చుతాయి.

ఫస్టాఫ్‌లో పవన్ అభిమానులకే కాదు… అందరికీ నచ్చేలా ఉంది. కథ బాగుంది. కథనం బాగుంది. హీరోకు పడిన ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. పులి, నక్క సీన్స్ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాయి. అలాగే డైలాగ్స్ బాగున్నాయి. కొల్లగొట్టినాదిరో.. అనే పాట కూడా బానే ఉంది. కాకపోతే, హీరో లుక్స్ మాత్రం కొన్ని చోట్ల సింక్ అవ్వవు. అవి పంటి కింద రాయిలా అనిపిస్తాయి. కానీ, 5 ఏళ్ల పాటు తీసిన చిత్రం కాబట్టి.. వాటిని ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు.

కానీ, సెకండాఫ్ కి వచ్చే సరికి, కథనం దారి తప్పినట్టు అనిపిస్తుంది. దీనికి కంటే ముందు సీజీ వర్క్ ‘దారుణం’ అనే వర్డ్ కూడా తక్కువే అనిపించేలా ఉంది. ఇన్ని కోట్లు పెట్టిన మూవీకి సీజీ వర్క్ ఇలా ఉందంటే ఎవరూ నమ్మరు. హీరో గుర్రంపై వెళ్తుంటే… హీరో హోండా బైక్ నడిపినట్టు అనిపిస్తుంది. అలాగే బ్యాగ్రౌండ్ లో వచ్చే గ్రాఫిక్స్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు.

కోర్ స్టోరీ బానే ఉన్నా.. సెకండాఫ్ లో నడిపిన కథనం మాత్రం తేలిపోయింది. సీజీ వల్ల కెమెరా పనితనం కూడా వీక్ అయిపోయింది. కానీ, ఇలాంటి టైంలో హీరోకు కొన్ని ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. అలాగే కీరవాణి మ్యూజిక్.. సినిమా పడిపోయిన ప్రతి సారి… కీరవాణి తన భుజాలతో నిలబెట్టాడు. అలా సాగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేసిన చౌకిదానా ఫైట్ మరోసారి అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఆ ఎపిసోడ్ సినిమాకు మళ్లీ కాస్త ప్రాణం పోస్తుంది. ఇక క్లైమాక్స్ వెళ్తే… అసంపూర్ణం అని అనలేం.. ఎందుకంటే ఈ మూవీ రెండు పార్ట్స్ కాబట్టి.. మిగితాది రెండో పార్ట్ లో చూడండి అని చెప్పాశారు.

ఇక పవన్ కళ్యాణ్ నటన గురించి అంటే, వన్ మెన్ షో. యాక్టింగ్, స్వాగ్, డైలాగ్ డెలవరీ.. ఇలా ప్రతి ఒకటి పవన్ మార్క్ చూపించాడు. ఈ పాయింట్ లో మైనస్‌లేం చెప్పలేం. నిధి అగర్వాల్ ప్రెజన్స్ బాగుంది. సాంగ్స్ లో కూడా పర్వలేదు అనిపించింది. విలన్‌‌గా బాబీ డియోల్ సరిగ్గా సెట్ అయ్యాడు. ఔరంగజేబు లుక్స్ బాబీ మంచి ఛాయిస్. కన్నులతోనే విలనిజాన్ని పండించాడు. అయితే, హీరో – విలన్ మధ్య వచ్చే సీన్స్ ఒక్కటి కూడా లేదు. అది సెకండ్ పార్ట్ లో ఉంటుంది.
ఇక మిగితా.. సునీల్, రఘుబాబు, నాజర్, సుబ్బరాజు పర్వలేదు అనిపించారు. అనసూయ ఓ సాంగ్ కు పరిమితం అయింది. అయితే ఆ సాంగ్ లో హీరో, హీరోయిన్ పై ఎక్కువ ఫోకస్ ఉండటం వల్ల ఆమెకు పెద్దగా స్కోప్ దొరలేదు.

సాంకేతిక విభాగం గురించి అంటే.. ముందుగా మ్యూజిక్. పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో కీరవాణి మ్యూజిక్ గురించి ప్రస్తావించాడు. అన్ని సార్లు ఎందుకు గుర్తు చూశాడు అంటే.. సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఒక్క మాటలో కీరవాణి ది బెస్ట్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. ఎడిటింగ్ సెకండాఫ్ లో కొంత మేరక్ పని చెప్పొచ్చు అని అనిపిస్తుంది. గ్రాఫిక్స్ సెకండాఫ్ మొత్తం తేలిపోయింది.

ప్లస్ పాయింట్స్ :

పవన్ కళ్యాణ్
ఫస్టాఫ్
ఇంటర్వెల్ ఎపిసోడ్ & ట్విస్ట్
కీరవాణి మ్యూజిక్ & సాంగ్స్

మైనస్ పాయింట్స్ :

వీఎఫ్ఎక్స్
సెకండాఫ్ లో కొంత ల్యాగ్

మొత్తంగా.. ఫ్యాన్స్‌కు వీరమల్లు మంచి విజయమే

Hari Hara Veeramallu Movie Rating : 3 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other Story