సాధారణ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఫీచర్ ఫిలిం క్వాలిటీతో తెరకెక్కించి తమ ప్రతిభను చాటుకుంటున్నారు ‘స్వాగతం కృష్ణా’ లాంటి ఇండిపెండెంట్ మూవీ టీమ్ సభ్యులు. నేత్ర ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై దర్శకుడు రాధాకృష్ణ పలవర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తుముకూరు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ఇటీవలే ప్రదర్శించారు. మరి ఈ ఇండిపెండెంట్ మూవీతో ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించారో చూద్దాం పదండి.

కథ: కృష్ణా(చైతన్య) చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి పెరుగుతాడు. చిన్నతనంలో తన తల్లి నుంచి ఎక్కువ ప్రేమను పొందడంతో… పెద్ద అయిన తరువాత కూడా తనకు కాబోయే ప్రేయసి నుంచి తన తల్లిలాంటి ప్రేమను పొందాలని ఆశిస్తాడు. అందులో భాగంగానే కృష్ణా అమ్మాయిలతోనే స్నేహం చేస్తుంటాడు. వారిలో తన అమ్మ చూపించే ప్రేమను ఎవరు చూపిస్తే.. వారిని పెళ్లి చేసుకోవాలని చూస్తుంటాడు. అందులో భాగంగానే తన క్లాస్ మేట్ సుప్రియ(అల్కా రాథోర్)తో స్నేహం చేయాలని ఎనిమిదేళ్లుగా ప్రయత్నిస్తుంటాడు. కానీ కృష్ణా స్నేహాన్ని మాత్రం అంగీకరించదు. మరి కృష్ణతో స్నేహానికి సుప్రియ ఎందుకు నిరాకరిస్తుంది? చివరికి వీ888రిద్దరూ స్నేహితులుగా మారినారా? కృష్ణకు తన తల్లిలాగ ప్రేమను పంచే ప్రేయసి దొరికిందా? తదితర విషయాలు తెలియాలంటే ఈ ఇండిపెండెంట్ సినిమాను చూడాల్సిందే

ప్లస్ పాయింట్స్ :

సినిమాటోగ్రఫీ
డైరెక్షన్
సినిమా కథ
మ్యూజిక్

మైనస్ పాయింట్స్
అక్కడ అక్కడ స్లో అనిపించింది

విశ్లేషణ: పసితనంలోనే తల్లి ప్రేమకు దూరమై… కనీసం ప్రేయసి నుంచైనా అలాంటి ప్రేమను పొందాలనుకునే ఓ యువకుని కథ ఇది. రొటీన్ గా ప్రేమకథను చూపించకుండా… తల్లిలాంటి ప్రేమను తన ప్రేయసి నుంచి పొందాలనుకునే యువకుని కోణంలో లవ్ ట్రాక్ ను తెరమీద చూపించిన తీరు బాగుంది. దర్శకుడు ఈ పాయింట్ ను ఓ అరగంట ఇండిపెండెంట్ సినిమాలో చూపించడానికి రాసుకున్న స్టోరీ… అందుకు అనుగుణంగా నడిపిన స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. ముఖ్యంగా సంభాషణలు చాలా బాగున్నాయి. దర్శకుడు రాధాకృష్ణ.. స్నేహం.. ప్రేమ అనే రెండు అంశాలను ఇద్దరు యువతీ యువకుల మధ్య చాలా హార్ట్ టచింగ్ గా చూపించారు.
హీరో చైతన్య చాలా బాగా నటించారు. తనకు కావాల్సిన ప్రేమకోసం… తన ప్రేయసి నుంచి పొందాలనుకునే యువకుని పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. అతని ప్రేయసిగా నటించిన అల్కా రాథోర్ కూడా బాగా నటించింది. ఫీచర్ ఫిలిం హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆమె నటన వుంది. ఇక మిగతా పాత్రలు పోషించిన బమ్ చిక్ బబ్లూ, బాలరాజు పులుసు, చందు షిండే, అనుష సుషర్ల తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు ఎంచుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. దానికి తోడు సంభాషణలు బాగా రాశారు. దాంతో ఈ ఇండిపెండెంట్ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫీచర్ ఫిలింకి ఏమాత్రం తీసిపోని రీతిలో దీన్ని తెరకెక్కించారు నిర్మాత. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. లీనస్ మధిరి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సతీష్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. సునీల్ అలహరి ఎడిటింగ్ బాగుంది.  హీరో.. హీరోయిన్లను చాలా అందంగా చూపించారు. ఫీచర్ ఫిలింకి ఏమాత్రం తీసిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఓ మంచి అవుట్ పుట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగింది చిత్ర యూనిట్. యూట్యూబ్ లో వాట్ ఇ7ట్..!

రేటింగ్: 3.25/5