బుల్లి తెర మీద వెండి తెర మీద ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకున్న రష్మీ , ప్రామిసింగ్ హీరో నందు జంటగా నటించిన చిత్రం శివరంజని . నాగ ప్రభాకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ సినిమా లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ మూవీ ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.

సినిమా కథ :
కార్తిక్ (నందు) కి యాక్సిడెంటల్ గా ఒక అమ్మాయి (రష్మీ)కలుస్తుంది . ఆ అమ్మాయి గతం మర్చిపోయిందని డాక్టర్స్ చెప్పడంతో కార్తీక్ పేపర్ లో ఆమె గురించి ఒక ప్రకటన ఇచ్చి తన ఇంటికి తీసుకు వస్తాడు. కార్తిక్ ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ఇంట్లో మధు గా పరిచయం చేస్తాడు. వారి పరిచయం ప్రేమ గా మారుతుంది . అక్కడ ఒక నీడ మధు ను వెంటాడుతుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం లో ఆమె కు తన గతం గురించి కొన్ని భయంకర మైన నిజాలు తెలుస్తాయి. ఇంతలో ఒక అతను వచ్చి మధు అసలు పేరు శివరంజని అని తన భార్య అని తీసుకు వెళ్తాడు . అతని ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె కు ఇంకా ఆ నీడ వెంటాడుతుంది. అసలు శివరంజినికి ఏమైంది…? భర్త అని తన జీవితం లోకి వచ్చిన వ్యక్తి ఎవరు…? తన గతం ఎందుకు మర్చి పోతుంది ..? అనేది మిగిలిన కథ …?

ప్లస్ పాయింట్స్ :

డైరెక్షన్
సినిమాటోగ్రఫీ
హీరో హీరోయిన్

మైనస్ పాయింట్స్ :

కామెడీ లేకపోవటం
సెకండ్ హాఫ్ డ్రాగ్
ఎడిటింగ్

కథనం విశ్లేషణ :
శివరంజిని సినిమా లో ఎక్కువుగా ఆకట్టు కున్నది దర్శకుడు రాసుకున్న కథ . థ్రిల్లర్ సినిమా అనగానే ప్రేక్షకులు ఆశించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఉండే కథను తయారు చేసుకున్నాడు. శివరంజని సినిమా లో మరో హై లైట్ కథనం ఎక్కడా కూడా గ్రిప్ ని కోల్పోని విధం గా కథనం నడిపించాడు . థ్రిల్లర్ సినిమా కు ఉండే లక్షణాలను పూర్తిగా ఉన్న కథ శివరంజని. జబర్దస్త్ తో ఫేమ్ అయిన రేష్మి కి వెండి తెర మీద గుంటూరు టాకీస్ హాట్ లుక్ ని తెచ్చింది. తర్వాత ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకునే సినిమాలే వచ్చాయి. కానీ శివరంజని రష్మీ కెరీర్ లో గుర్తుండి పోయే చిత్రం గా మిగులుతుంది అనడం లో సందేహమే లేదు . తన పాత్ర లో యాక్షన్ కి అంత స్కోప్ దొరికింది. రష్మీ తన పాత్ర కు పూర్తి న్యాయం చేసింది. తానెవరో తెలియని పాత్ర గా మొదలై మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టిన మధు గా ఆ క్యారెక్టర్ లో చాలా వేరియషన్స్ కనిపిస్తాయి. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రతి పది నిముషాలకి రష్మీ పాత్ర కొత్తగా మారుతుంది. ఈ లాంటి భిన్నమైన పాత్ర లు ఏ ఆర్టిస్ట్ కయినా అరుదుగా వస్తాయి . అలాంటి పాత్ర కు రష్మీ ప్రాణం పోసింది. థ్రిల్లింగ్ సినిమా లో ఎన్ని చిక్కి మూడు లైన వేయొచ్చు, కానీ వాటిని విప్పే క్రమం లో లాజిక్ లు మిస్ అయితే ప్రేక్షకులు చిరాకు పడతారు. దర్శకుడు ప్రభాకర్ కొత్త వాడైనా కథను ఎక్కడా లాజిక్ మిస్ అవ్వకుండా స్క్రీన్ పైకి తెచ్చాడు. ఫస్ట్ ఆఫ్ కి కథ అయిపొయింది అనే ఫీల్ తెచ్చి సెకండ్ ఆఫ్ లో అసలు కథ ను రీవీల్ చేసాడు. అక్కడి నుండి కథనం వేగం అందుకుంది. సెకండ్ ఆఫ్ లో అఖిల్ కార్తిక్ నటన హైలైట్ గా మారింది. అసలు ఎవరు చెప్పేది నిజం ఎవరు ఇందులో విలన్ అనే డౌట్ ని ప్రతి క్షణం కలిగించాడు దర్శకుడు. టైం తెలియనీయకుండా కథ చెప్పడం లో సక్సెస్ అయ్యాడు. మధ్యలో వచ్చే పాప్ కార్న్ సాంగ్ కూడా మంచి ఎనర్జీ ని తెర మీదకు తెచ్చింది. ఈ కథ లో రష్మీ నటన అఖిల్ నటన ఒక్కో సన్నివేశం లో పోటీ పడతాయి. శివరంజని ఎవరు అనే అన్వేషణ ప్రేక్షకుల్లో మొదలవుతుంది. అదే శివరంజిని కి కీ పాయింట్ . ఆ పాయింట్ కి ఎక్కడా కూడా గ్రిప్ పోకుండా తెరమీద చెప్పాడు దర్శకుడు. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ ఈ మూవీ కి అదనపు బలం గా మారింది. యూ అండ్ ఐ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి . మంచి స్కోప్ ఉన్న కథ ను తీసుకొని ఎక్కడా థ్రిల్ మిస్ అవ్వకుండా ప్రేక్షకులకు అందించడం లో టీం సక్సెస్ అయ్యింది.

చివరి మాట : థ్రిల్లింగ్ శివరంజని ఈ వారం చూడదగ్గ చిత్రo

 

రేటింగ్ 3/5