ఎస్. ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ పై ఈశ్వర్ నిర్మిస్తోన్న చిత్రం `నిన్ను చూశాక‌`. శాంతి రాజు, ఆధ్య జంట‌గా యు. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర విశేషాల‌ను నిర్మాత‌ వెల్ల‌డించారు.

మా చిత్రంలో అంతా కొత్త వాళ్లే న‌టిస్తున్నారు. అయినా అనుభ‌వం గ‌ల న‌టీన‌టుల్లా న‌టించారు. ద‌ర్శ‌కుడు మంచి ఔట్ ఫుట్ తీసుకొచ్చారు. ప్యాక్ష‌న్ క‌మ్ ల‌వ్ స్టోరీ ఇది. ఆద్యంతం ఆస‌క్తిరంగా ఉంటుంది. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే ఆక‌ట్టుకుంటుంది. బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. మా సినిమా ప్ర‌చార చిత్రాల‌ను ప‌లువురు సినీ పెద్ద‌లు చూసి మెచ్చుకున్నారు. రెండు పాటలు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. చివ‌రి షెడ్యూల్ ను క‌ర్నూలు, బ‌ళ్లారి, హంపీ, గుంత‌క‌ల్లు, ఆదోనీ ప్రాంతాల్లో చిత్రీక‌రించాం. మ‌రికొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను ఔట్ డోర్ లో షూట్ చేసాం. క‌థ‌కు త‌గ్గ చ‌క్క‌ని పాట‌లు కుదిరాయి. మ్యూజిక‌ల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది. అతి త్వ‌ర‌లోనే పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏలేంద్ర‌, ఛాయాగ్ర‌హ‌ణం: రామ్ శ్రీనివాస్, స‌హ నిర్మాత‌: పి. ప‌వ‌న్