నేను లేను మూవీ లో హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహించారు.

సినిమా కథ : ఈశ్వర్(హర్షిత్) కర్నూల్ నగరంలో ఓ వీడియోగ్రాఫర్  తనకు ఇష్టమైన కాన్సెప్టులు వీడియో లు గా తీస్తూ అందులో అందరి దగ్గర మెప్పు పొందుతుంటాడు. అతను పార్వతి(శ్రీపద్మ)ను తొలిచూపులోనే ప్రేమించి ఆమె తన భార్య అనే ఊహాలోకంలో విహరిస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ పార్వతి కూడా ఈశ్వర్ ప్రేమను ఆంగీకరించి. పెళ్లిపీటలు ఎక్కడానికి రెడీ అవుతుంది. అయితే వీరి ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తారు పార్వతి తల్లిదండ్రులు. తమకు నచ్చిన వాణ్నే పెళ్లి చేసుకోవాలని షరతు కూడా విధిస్తారు. అయితే వీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మరి వీళ్లిద్దరూ పారిపోయి వివాహం చేసుకున్నారా? అలా చేసుకుని వుంటే. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అయింది? ఈశ్వర్ సైకలాజికల్ గా ఎలాంటి డిజార్డర్ తో బాధపడ్డాడు? చివరికి ఈశ్వర్.. పార్వతిలు ఒక్కటయ్యారా? అనేది మీరు తెరపై చూడలిసిందే.

సినిమా విశ్లేషణ : థ్రిల్లర్ జోనర్లను ఇంట్రెస్టింగ్ గా తెరమీద చూపగలిగితే.. ప్రేక్షకుల్ని థియేటర్లకు కూర్చోబెట్టచ్చు . అందులోనూ థ్రిల్లర్ కు ఓ ఇంట్రెస్టింగ్ డిజార్డర్ ను జోడించి రాసుకున్న కథను ఆసక్తికరమైన కథనంతో తీయగలిగితే ప్రేక్షకులు మరింత ఇంట్రెస్ట్ చూపుతారు. ఈ సినిమాలో దర్శకుడు చేసింది కూడా అదే

రొటీన్ కథ.. కథనాలకు వెళ్లకుండా.. కోటర్డ్ సిండ్రోమ్ అనే ఓ సైంటిఫిక్ డిజార్డర్   లైన్ అనుకోని దర్శకుడు చెబుతున్నట్టు ఇప్పటి వరకు తెరకెక్కని ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా ‘నేను లేను’ చిత్రాన్ని మన ముందుకు తీసుకురావడం అభినందనీయం. ఓ వైపు అందమైన ప్రేమకథను హీరో.. హీరోయిన్ల మధ్య ఎస్టాబ్లిష్ చేస్తూనే… మరో వైపు థ్రిల్లింగ్ కలిగించే ఎలిమెంట్ తో ప్రేక్షకుల్లో ఉత్కంఠతను రేపారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ తో ప్రేక్షకులు బాగా థ్రిల్ అవుతారు. నెక్ట్స్ ఏంజరగబోతుంది అనే ఉత్సూకతతో ప్రేక్షకులు క్షణ క్షణం థ్రిల్ గా ఉంటుంది.

నటీనటులు: ఇందులో హీరో.. హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వారిద్దరి మధ్య రాసుకున్న సీన్లు… సంభాషణలు యూత్ కి కనెక్ట్ అయ్యేలా వున్నాయి. అలా హీరోయిన శ్రీపద్మ కూడా హీరోతో పాటు చక్కగా నటించారు. విలన్ తన పాత్రకు న్యాయం చేశారు. అలానే మిగతా పాత్రలు హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ   సినిమాతో దర్శకుడు రామ్  సక్సెస్  అయ్యారు.

ప్లస్‌ పాయింట్స్‌

నటీనటులు
కథ
దర్శకత్వం
ఫోటోగ్రఫీ

మైనస్‌పాయింట్స్‌

స్లో నెరేషన్‌ కొన్ని సన్నివేశాలు
ఎడిటింగ్

సినీ మిర్చి.కామ్ రేటింగ్ 3/5