నీకోసం మూవీ తాజాగా అవినాష్ కోకటి అనే యువ దర్శకుడు కూడా తను నిజజీవితంలో చూసిన కొన్ని పాత్రలను… సంఘటనలను దృష్టిలో వుంచకుని ‘నీ కోసం…’ అనే స్టోరీని తెరకెక్కించారు. ఇందులో అరవింద్ రెడ్డి. సుభాంగి పంత్ ఓ సంటగా… అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతిలు మరో జంటగా నటించారు. ‘లవ్ స్టోరీనే కాదు.. లైఫ్ స్టోరీ’ ఇది అని చిత్ర యూనిట్ ఇస్తున్న స్టేట్ మెంట్ ప్రేక్షకుల్ని ఎంతవరకు తృప్తి పరుస్తుంది అని చూడాలి !

కథ : అరవింద్ రెడ్డి.. సుభాంగి పంత్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే ఇద్దరి మధ్య తరచు చిన్న చిన్న గొడవలొస్తుంటాయి. అదే సమయంలో అరవింద్ కు తన మిత్రుణ్ని కలవడానికి వెళ్లగా అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ లో అరవింద్ రెడ్డికి గాయాలయ్యి ఆసుపత్రిపాలు అవుతాడు. అదే సమయంలో అక్కడ ఓ డైరీ దొరుకుతుంది. అందులో అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతిల ప్రేమకథ అందులో రాసి వుంటుంది. అజిత్ బాంబ్ బ్లాస్టులో చనిపోయాడని భావించిన అరవింద్… వారిద్దరి ప్రేమకథను తెలుసుకుంటూనే… మరోవైపు తన ప్రియురాలితో ప్రేమను సాగిస్తూ… తనతో తరచు గొడవ పడుతూ వుంటాడు. మరి ఇలా సాగిపోతున్న వీరిద్దరి ప్రేమ చివరకు ఏమైంది? అసలు అజిత్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడా? అజిత్.. దీక్షితా పార్వతిల ప్రేమ ఫలించిందా? అసలు బాంబు బ్లాస్టులో చనిపోయింది ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ‘ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ దగ్గర నా మొబైల్ నెంబర్ కౌంటర్ లో ఇస్తాను. సినిమాను చూసి.. ఈ సినిమా బాగోలేదు అంటే నేను వాళ్ళ డబ్బులు వెనక్కి ఇస్తాను’ అని ఇటీవల ఈ చిత్ర హీరోల్లో ఒకరైన అరవింద్ రెడ్డి ప్రేక్షకులకు ఇచ్చిన ఆఫర్ ను చూసి… ఏంటి హీరోకు అంత కాన్ఫిడెంట్ అనుకున్నారంతా. సినిమా చూసిన తరువాత హీరో ప్రేక్షకులకు ఇచ్చిన ఆఫర్ ను చూస్తే… కంటెంట్ మీద వున్న నమ్మకంతోనే హీరో అరవింద్ రెడ్డి అలా అన్నడనిపిస్తుంది. మనం నిజజీవితంలో మన చూట్టూ జరిగే కొన్ని ప్రేమకథలను దృష్టిలో వుంచుకుని అరవింద్.. సుభాంగిల మధ్య లవ్ ట్రాక్ ను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రేమికుల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలను మనం నిత్యం చూస్తూనే వుంటాం. అందులో ముఖ్యమైంది సెల్ ఫోన్ బిజీ రావడం.. కాల్ వెయిటింగ్ రావడం.. దాందో వారిద్దరి మధ్య విబేధాలు తలెత్తి.. మనస్పర్ధలకు దారితీయడం.. తరువాత రాజీ పడటం లాంటి నిత్యజీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలను సైతం ఇందులో చూపించారు. సున్నీతమైన భావోద్వేగాలను ప్రేమికల మధ్య వుండే సున్నితమై బంధాలను తెరమీద ఎంతో చక్కగా చూపించారు దర్శకుడు. ఓవరాల్ గా యూత్ కి నచ్చేలా ‘నీ కోసం..’ తెరకెక్కించా దర్శకుడు.
అరవింద్ రెడ్డి.. కాస్త అగ్రెసివ్ నెస్ వున్న ప్రేమికుని పాత్రలో నటించి.. పక్కింటి అబ్బాయిలా కనిపించారు. అతనికి జంటగా నటించిన సుభాంగి పంత్.. ఎంతో నెమ్మదస్తురాలిగా… తన ప్రియుడి మనోభావాలు ఎరిగిన సాఫ్ట్ వేర్ అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. అలానే అజిత్ కూడా మోడ్రన్ భావాలున్న దీక్షితా పార్వతీ ప్రేమలో పడే ఓ దిగువ మధ్యతరగతి కుర్రాడి పాత్రలో నటించారు. అలానే మోడ్రన్ అమ్మాయి పాత్రలో దీక్షితా నటించారు. ఇక కమెడీయన్స్ గా సుదర్శన్, సాయి పంపన నటించి నవ్వించారు.
ప్లస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
ఫోటోగ్రఫీ
హీరో
హీరోయిన్

మైనస్ పాయింట్స్ :

సీరియస్ గా కథ నడిపించటం
కామెడీ పండకపోవటం

దర్శకుడు అవినాష్ రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. సున్నితమైన లవ్ ట్రాక్ ను బాగా డీల్ చేశారు. ఇందులో ‘లవ్ స్టోరీనే కాదు.. లైఫ్ స్టోరీ’ వుందని నిరూపించారు. యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. సంగీత దర్శకుడు మంచి ఆల్బమ్ ఇచ్చారు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుంటే బాగుండు. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. రెండు జంటలను అందంగా చూపించారు. వైజాగ్ అందాలను బాగా చూపించారు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. నిర్మాత ఖర్చుకు వెనకాడలేదు. గో అండ్ వాచ్ ఇట్

సినిమిర్చి .కామ్ రేటింగ్: 3