అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరో హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం “మళ్ళీ మళ్ళీ చూశా”.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.. కాగా ఈ సినిమా నుంచి “ఈ క్షణమే” పాట ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ” కిల్లర్ ” మూవీ తో సూపర్ హిట్ కొట్టిన విజయ్ ఆంటోనీ ఆ చిత్ర సక్సెస్ మీట్ లో ఈ పాట లిరికల్ వీడియో ని రిలీజ్ చేయడం విశేషం..

ఈ సందర్భంగా దర్శకుడు హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ.. మంచి కథ తో వస్తున్న సినిమా ఇది.. అందరిని తప్పకుండా మెప్పిస్తుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అన్నారు..

నిర్మాత కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ… ఈ సినిమా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన హీరో విజయ్ ఆంటోనీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. సినిమా చాల బాగా వచ్చింది.. వచ్చే నెలలో సినిమా ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అన్నారు..

నటీనటులు : అన్నపూర్ణమ్మ, అజయ్, మధుమణి, ప్రభాకర్, టి.ఎన్. ఆర్, మిర్చి కిరణ్, కరణ్, బాషా, ప్రమోద్, పావని, జయలక్మి, మాస్టర్ రామ్ తేజస్, బంచిక్ బబ్లూ, తదితరులు..

సాంకేతిక నిపుణులు :
రచన,దర్శకత్వం : హేమంత్ కార్తీక్
నిర్మాత : కె. కోటేశ్వరరావు
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : కళ్యాణ్ సమి సతీష్ ముత్యాల
ఎడిటర్ : సత్య గిడుతూరి
లిరిక్స్ : తిరుపతి జావాన
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాలకుర్తి