వేగేశ్న సతీష్ ‘కోతి కొమ్మచ్చి’ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం !

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘామ్ష్ శ్రీహరి , సమీర్ వేగేశ్నలు హీరోలుగా ‘కోతి కొమ్మచ్చి’ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ ” యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న మా చిత్రంలో సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. సినిమాలో ఐదు పాటలు ఉంటాయి. యువతను ఆకట్టుకునేలా అనూప్ పాటలు సమకూరుస్తూ, కథకు తగ్గట్టుగా మంచి ఆల్బం ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాం” అని తెలిపారు.

నిర్మాత ఎం ఎల్ వి సత్యానారాయణ మాట్లాడుతూ ” సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. విజయదశమికి పూజా కార్యక్రమాలతో ప్రారంభించి నవంబర్ నుండి షూట్ మొదలు పెడతాం” అని అన్నారు.