నటీనటులు : సంపూర్ణేష్ బాబు,ఇషికా సింగ్,షకీలా,మహేష్ కత్తి

దర్శకత్వం : రోనాల్డ్ రూపక్ సన్

నిర్మాత‌లు : సాయి రాజేష్ నీలం

సంగీతం : సయీద్ కమ్రాన్

సినిమాటోగ్రఫర్ : ముజీర్ మాలిక్

ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్

సినిమిర్చి.కామ్ రేటింగ్ 3.25/5

2014లో వచ్చిన హృదయ కాలేయం చిత్రంతో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన నటుడు సంపూర్ణేష్ , తాజాగా నటించిన “కొబ్బరి మట్ట” మూవీ నేడు విడుదలైంది.

సినిమా కథ :
రాయుడు(సంపూర్ణేష్ బాబు) తన గ్రామ పెద్దగా, తన ఊరి ప్రజలకు పెద్ద దిక్కుగా, తన ముగ్గురు భార్యలతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. అలాంటి రాయుడు జీవితం యాండ్రాయుడు(సంపూర్ణేష్ బాబు) రాకతో ఒడిదుడుకులకు లోనవుతుంది. అసలు ఎవరు ఈ యాండ్రాయుడు? అతనికి రాయుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

సంపూర్ణేష్
కామెడీ
మ్యూజిక్
షకీలా

మైనస్ పాయింట్స్:
కొన్ని లాజిక్ లెన్స్ సీన్స్

సాంకేతిక విభాగం:
చిత్ర బడ్జెట్ పరిధిలో నిర్మాణ విలువలు డీసెంట్ గా పర్వాలేదు అనిపిస్తాయి. హై పిచ్ లో నడిచే అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఇక ముఖ్యంగా స్టీవ్ శంకర్ రాసిన డైలాగ్స్ తెరపై నవ్వులు పూయించాయి. ఆయన డైలాగ్స్ మూవీకి మంచి ఆకర్షణ గా నిలిచాయి. అలాగే మూవీ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. మూవీ ప్రతి పదినిమిషాల వ్యవధిలో చక్కగా చొప్పించిన హాస్య సన్నివేశాలు ఆహ్లదం కలిగిస్తాయి.
ఇక దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ మూవీ అక్కట్టుకొనేలా తీయడంలో ఎంత కష్టపడ్డారో తెరపై కనిపిస్తుంది. కథలో కానీ సన్నివేశాలలో కానీ ఎటువంటి లాజిక్ లేకపోయినప్పటికీ తాను అనుకున్న విధంగా సంపూర్ణేష్ తో తెరపై హాస్యం పండించడంలో విజయం సాధించారు అని చెప్పొచ్చు.

చివరి మాట :కొబ్బరి మట్ట సంపూర్ణేష్ బాబు అభిమానులను ఆద్యంతం అలరించే సంపూర్ణమైన కామెడీ మూవీ. కేవలం హాస్యం మాత్రమే ఆశించి వెళ్లేవారిని మాత్రం సంపూ సంతృప్తి పరుస్తాడు అనడంలో సందేహం లేదు.