ఫ్యాషన్ ప్రపంచాన్ని ప్రతీ ఇంటికి పరిచయం చేసి ట్రెండ్ క్రియేట్ చేసింది ఫ్యాషన్ టీవీ. ఇప్పుడీ ఫ్యాషన్ టీవీ మరింతగా విస్తరిస్తూ… బ్యూటీ సెలూన్ రంగంలో దూసుకెళ్తోంది. ఇప్పుడు హైదరాబాద్ మాదాపూర్ లో అత్యూధునిక టెక్నాలజీ తో కూడిన ఎక్విప్ మెంట్, నిపుణుల పర్యవేక్షణలో ఎఫ్ సెలూన్ లాంచ్ చేశారు. ఫ్యాషన్ ట్రెండ్స్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ… ఫ్యాన్ పాలోయింగ్ ను విపరీతంగా పెంచుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రణీత ఈ ఎఫ్ సెలూన్ ను లాంచ్ చేసింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా… శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేకర్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరాం ఐఆర్ఎస్ హాజరయ్యారు. వీరితోపాటు ఫ్యాషన్ టీవీ మేనేజ్ మెంట్ పర్సనల్, ఎఫ్ సెలూన్ మెంటార్ కాషిఫ్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా

ఎఫ్ సెలూన్ అధినేత సుధాకర్ మాట్లాడుతూ…. ఫ్యాషన్, బ్యూటీ రంగానికి ఓ ప్రాముఖ్యతను తీసుకొచ్చింది ఎఫ్ టీవీ. అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీ సెలూన్ రంగంలోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇందులో భాగంగా ఎఫ్ సెలూన్ బ్రాండ్ తో హైదరాబాద్ లో ప్రీమియం సెలూన్ సేవల్ని అందించేందుకు సిద్దమయ్యాం. మాదాపూర్ లాంటి ప్రైమ్ లొకేషన్ లో అత్యాధునిక ఎక్విప్ మెంట్ తో, సెలూన్ రంగంలో నిష్ణాతులైన టాప్ బ్యూటీషియన్స్ పర్యవేక్షణలో ఎఫ్ సెలూన్ ను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ ని బ్యూటీ రంగంలో ఓ మెట్టు పైన ఉంచేందుకు ఈ ఎఫ్ సెలూన్ ప్రయత్నిస్తుంది. ప్యాషన్ టీవీ ప్రతినిథి కాషిఫ్ ఖాన్ ఎఫ్ సెలూన్ మెంటార్ గా సేవలందించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారికి, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేకర్ రెడ్డి గారికి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరాం ఐఆర్ఎస్ గారిక, మరియు హీరోయిన్ ప్రణీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అని అన్నారు.

ఫ్యాషన్ టీవీ మెంటార్ కాషిఫ్ ఖాన్ మాట్లాడుతూ…. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఫ్యాషన్ టీవీ నుంచి వస్తున్న ఎఫ్ సెలూన్ ను హైదరాబాద్ మాదాపూర్ లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. బ్యూటీ రంగంలో వస్తున్న ట్రెండ్స్ ను హైదరాబాద్ కు పరిచయం చేస్తూ…. అన్ని రకాల సెలూన్ సేవల్ని అందించే ఉద్దేశ్యంతో ఎఫ్ సెలూన్ బ్రాండ్ ను ఇక్కడ స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్ వాల్యూను మరింతగా పెంచేందుకు మెంటార్ గా సేవలందిస్తాను. అని అన్నారు.