నటీనటులు : బిష్ణు అధికారి , అపర్ణ శర్మ , హిమాన్షి ఖురానా
సంగీతం : మంత్ర ఆనంద్
నిర్మాత : హరి
దర్శకత్వం : సంపత్ రుద్రారపు
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 14 జూన్ 2019

సినిమా స్టోరీ :

బ్రిలియంట్ స్టూడెంట్ అయిన సిద్దూ అపర్ణ శర్మ ని ప్రేమిస్తాడు . అపర్ణ శర్మ కూడా సిద్దూ ని అమితంగా ఇష్టపడుతుంది . అయితే ఉగ్రవాదుల దాడిలో అపర్ణ శర్మ చనిపోతుంది . దాంతో సంఘ వ్యతిరేకులైన ఉగ్రవాదులను అంతం చేయాలనుకుంటాడు సిద్దూ . ఉగ్రవాదులను అంతం చేయడానికి సిద్దూ ఎంచుకున్న మార్గం ఏంటి ? అందులో సక్సెస్ అయ్యాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

ప్లస్ పాయింట్స్ :

కథాంశం
హీరో నటన

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

పెర్ఫార్మెన్స్ :

ఉగ్రవాదులను , అరాచక వాదులను అంతం చేయాలనే సిద్దు పాత్రలో అద్భుతంగా రాణించాడు బిష్ణు అధికారి . నటనలోనే కాదు మంచి ఫిజిక్ తో కూడా ఆకట్టుకున్నాడు బిష్ణు . అపర్ణ శర్మ గ్లామర్ తో అలరించింది , అలాగే హిమాన్షి ఖురానా గ్లామర్ కే పరిమితం అయ్యింది . కీలక పాత్రలో సుమన్ నటించాడు . ఇక సుమన్ గురించి కొత్తగా చెప్పేదేముంది . అలాగే బెనర్జీ , శ్రవణ్ , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు తమ తమ పాత్రల్లో రాణించారు .

టెక్నికల్ టీమ్ :

మంత్ర ఆనంద్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది , అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి . ఖర్చుకు వెనుకాడకుండా మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి తన నిర్మాణ దక్షతని నిరూపించుకున్నారు హరి . ఇక దర్శకుడు సంపత్ విషయానికి వస్తే బర్నింగ్ పాయింట్ ని కథా వస్తువుగా ఎంచుకొని మంచి ప్రయత్నమే చేసాడు . నటీనటుల నుండి చక్కని నటన ని రాబట్టుకున్న దర్శకుడు యువతని ఆలోచింప జేసే విధంగా ఏక్ చిత్రాన్ని మలిచాడు .

చివరగా : దేశభక్తి కి నిర్వచనం చిత్రం ఈ ఏక్