థ్రిల్లర్లను తీయగలిగితే బాక్సులు బద్దలవ్వాల్సిందే. తాజాగా తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా.. రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దర్పణం

కథ: కార్తీక్(తనిష్క్ రెడ్డి) తన ముగ్గురు మిత్రలతో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ హ్యీపీగా బతికేస్తుంటాడు. అందులో భాగంగా ఓ రోజు ఓ పెద్ద బంగ్లాలోకి దొంగతనానికి వెళతారు. అయితే అక్కడ ఓ నలుగురు కావ్య( శుభంగిపంత్‌)తో సహా దారుణంగా హత్యకు గురై.. విగత జీవులుగా పడి వుంటారు. అందులో ఆ ఇంటి పెద్ద కొనవూపిరితో వుండగా అతన్ని రక్షించాలని కార్తీక్ అనుకంటారు. అయితే.. తోటి స్నేహితులు మొదట తాము వొచ్చిన దొంగతనం చేసేసి అక్కడి నుంచి బయట పడదాం.. లేకుంటే మన మీదకు వస్తుందని చెప్పడంతో… ఆ పెద్దాయన చావు ఆర్తనాదాలు పట్టించుకోకుండా దొంగతనం చేసేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే.. కార్తీక్ ప్రేమించిన మధు(ఎలక్సియస్‌)ను ఓ దెయ్యం వెంటాడుతూ వుంటుంది. అలానే కార్తీక్ తో సహా తన స్నేహితుంలదరినీ వెంటాడుతూ వుంటుంది. మరి ఆ నలుగురిని అంత కిరాతకంగా చంపింది ఎవరు? వీరిని వెంటాడే దెయ్యం ఎవరు? వీటన్నింటినీ పోలీసులు ఎలా ఛేదించారు? అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:
డైరెక్షన్
హీరో హీరొయిన్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
కామెడీ లేకపోవటం

కథ విశ్లేషణ : క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘దర్పణం’ చిత్రం.. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేస్తుంది. దర్శకుడు డైరెక్టుగా పాయింట్ లోకి వెళ్లి.. మర్డర్ మిస్టరీ కోణంలో కథ.. కథనాలను నడిపించారు. సరదాగా దొంగతనాలు చేసే కుర్రాళ్లు క్రైమ్ థ్రిల్లర్ లో ఎలా ఇన్ వాల్వ్ అయ్యారనే దాన్ని చాలా తొందరగానే రివీల్ చేయకుండా చివరిదాకా సస్పెన్స్ ను కొనసాగించి… ప్రేక్షకుల్లో ఆ క్యూరియాసిటీని పెంచారు. మనం రోజూ చూసే.. కొంత మంది అబ్బాయిలు.. అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా వేధించడం.. తోటి వారితో క్లోజ్ గా వుంటే శాడిజం చూపించడం లాంటివి తరచుగా చూస్తుంటాం. అలాంటి ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని దర్పణం చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించడం చాలా థ్రిల్లింగ్ గా వుంది. ఓ వైపు మర్డర్ మిష్టరీని కొనసాగిస్తూనే.. మరో వైపు హారర్ తో భయపెట్టడం ఆడియన్స్ ను ఎంతో థ్రిల్ చేస్తుంది.
హీరో తనిష్క్ రెడ్డి నటనలో చాలా ఈజ్ ను ప్రదర్శించారు. డైలాగు డెలివరిలోనూ.. డ్యాన్స్ లు వేయడంలోనూ తన ప్రతిభను చూపారు. అతనితో పాటు నటించిన ముగ్గురు స్నేహితులు కూడా చాలా సరదాగా నటించి మెప్పించారు. దెయ్యంగా నటించిన శుభంగి పంత్ చాలా ఎనర్జిటిక్ గా నటించింది. అలానే హీరోయిన్ ఎలక్సియస్ కూడా గ్లామర్ డాల్ గా నటించి ఆకట్టుకుంది. పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించిన నటుడు ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు. అతని అసిస్టెంట్ కూడా బాగానే చేశారు. విలన్ పాత్రలో శంకర్ గా నటించిన నటుడు కూడా బాగానే చేశాడు.
దర్శకుడు రామకృష్ణ రాసుకున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ప్లాట్ బాగుంది. కథనం ఇంకాస్త బాగుంటే బాగుండు. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్ ఎఫెక్ట్ పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ జోనర్స్ కి ఖర్చు పెట్టాల్సినంత పెట్టేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ ని చూసి ఎంజాయ్ చేసేయండి.

సినిమిర్చి.కామ్ రేటింగ్ : 3/5