నటీనటులు : హరీష్ వినయ్ , బ్రహ్మానంద రెడ్డి , తనిష్క్ రాజన్
సంగీతం : సుభాష్ ఆనంద్
నిర్మాత : బ్రహ్మానంద రెడ్డి
ఛాయాగ్రహణం ,దర్శకత్వం : అనిల్ పిజి రాజ్
రేటింగ్ : 3/5
రిలీజ్ : 27 జూలై 2019

హరీష్ వినయ్ , తనిష్క్ రాజన్ జంటగా అనిల్ దర్శకత్వంలో బ్రహ్మానంద రెడ్డి నిర్మించిన చిత్రం బైలం పూడి . ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

బైలం పూడి అనే గ్రామంలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటో నడుపుకుంటూ అమ్మకు తోడుగా ఉంటాడు రవి ( హరీష్ వినయ్ ). అదే గ్రామంలో గ్రామపెద్ద అయిన గురు నారాయణ్ ( బ్రహ్మానందరెడ్డి ) అంటే అందరికి గౌరవం , భయం కూడా . కానీ అలాంటి గురు నారాయణ్ ని ఎదిరించి నిలబడిన రవి ని చూసి ఇష్టపడుతుంది కళ్యాణి (తనిష్క్ రాజన్ ) . రవి – కళ్యాణి ల ప్రేమకు అడ్డుగా నిలుస్తాడు గురు నారాయణ్ . దాంతో గురు నారాయణ్ ని చంపేస్తాడు రవి . కానీ గురు నారాయణ్ చనిపోయే ముందు కళ్యాణి గురించి నమ్మశక్యం కానీ నిజం చెప్పి చస్తాడు ? అసలు గురు నారాయణ్ చెప్పిన నిజం ఏంటి ? కళ్యాణి ఏం చేసింది ? కళ్యాణి గురించి తెలిసిన రవి ఏం చేసాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

రియలిస్టిక్ అప్రోచ్
బ్రహ్మానంద రెడ్డి
హరీష్ వినయ్
ఎంటర్ టైన్ మెంట్
సంగీతం
దర్శకత్వం

నటీనటుల ప్రతిభ :

గ్రామపెద్దగా విలన్ పాత్రలో మెప్పించాడు బ్రహ్మానంద రెడ్డి , నటనపై ఇంకాస్త శ్రద్ధ పెడితే తెలుగువాళ్ళకు మరో మంచి విలన్ దొరికినట్లే ! ని చెప్పాలి . హీరోగా నటించిన హరీష్ వినయ్ బాగా నటించాడు . డ్యాన్స్ లతో పాటుగా ఫైట్స్ లలో కూడా రాణించాడు . తనిష్క్ రాజన్ ఆల్రెడీ పలు చిత్రాల్లో నటించింది , ఈ సినిమాలో కూడా మరోసారి అలరించే ప్రయత్నం చేసింది . ఇక హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటరాజ్ , నత్తి నరి హాస్యంతో మెప్పించారు , అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడ అదరగొట్టారు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలో రాణించారు .

సాంకేతిక వర్గం :

సుభాష్ ఆనంద్ అందించిన పాటలు బాగున్నాయి , ఇక రెండు పాటలు అయితే మరీ మరీ బాగున్నాయి . నేపథ్య సంగీతం కూడా ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది . విజువల్స్ బాగున్నాయి . ఛాయాగ్రాహకులు కూడా దర్శకుడే కావడంతో సహజసిద్దమయిన లొకేషన్ లలో బైలం పూడి ని చిత్రీకరించాడు . గంజాయి సమస్య ని ఎంచుకొని దాని చుట్టూ ఓ కథని అల్లుకొని మంచి ప్రయత్నమే చేసాడు అనిల్ . మన్మధ సాయి అందించిన డైలాగ్స్ బాగున్నాయి .

ఓవరాల్ గా :

బైలం పూడి ని తప్పకుండా ఓసారి చూడొచ్చు .