శ్రీ పవర్, కృతి గర్గ్ హీరో హీరోయిన్లు గా శ్రీనిక క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందిన సినిమా ‘2 అవర్స్ లవ్’ కూడా ఇలాంటిదే. మరి ఈ లవ్ యూత్ కు ఏమాత్రం నచ్చుద్దో చూద్దాం .

సినిమా కథ: ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దొంగకు (అశోక్)… ఆ ఇంట్లో ఓ డైరీ దొరుకుతుంది. అందులో అదిత్(శ్రీ పవర్), నయనా(కృతి గర్గ్)ల ప్రేమ కథ రాసి ఉంటుంది. ఆ డైరీ చదవడం పూర్తయ్యాక వాళ్ళిద్దరి లవ్ స్టొరీ నచ్చి బుక్ రాస్తాడు ఆ దొంగ. అవి మార్కెట్లో విపరీతంగా అమూడుపోతాయి. దానికి కారణం అదిత్, నయనాల ప్రేమ కథ. రెండు గంటలు మాత్రమే ప్రేమించుకునే ప్రేమికుల జంట కొత్త కథ. అసలు వాళ్ళు రెండు గంటలు ప్రేమించుకోవడానికి కారణం ఏంటి? రెండు గంటలు ప్రేమించడానికి ఆదిత్య ఎటువంటి కష్టాలు పడతాడు? కేవలం రెండు గంటలు మాత్రమే ప్రేమించమని కండిషన్ పెట్టాడనికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే సినిమా చూడాల్పిందే.

కథ.. కథనం విశ్లేషణం: మనం చాలా ప్రేమకథలను సిల్వర్ స్క్రీన్ మీద చూసుంటాం. కానీ కండీషన్స్ తో కూడిన ప్రేమకథలను మాత్రం చాలా అరదుగానే చూసిన అనుభం తెలుగు ప్రేక్షకులది. అందులోనూ కేవలం రోజుకు రెండు గంటలు మాత్రమే ప్రేమించుకునే ప్రేమజంట కథలను ఇప్పటి వరకూ చూసుండం. అలాంటి కథను తాజగా దర్శకుడు కమ్ హీరో శ్రీపవర్… తెరమీదకు ఎక్కించి ప్రేక్షకుల మనసును దోచేశాడు. ఓ అమ్మాయి పలానా టైంకి లైస్తాను.. పలానా టైం నుంచి పలానా టైంకి యోగా చేస్తాను.. ఆ తరువాత కాలేజీకి వెళతాను.. ఇలా రోజు మొత్తం రాత్రి పడుకునేంత వరకూ టైం టేబుల్ చెప్పేసి… పలానా టైంలో మాత్రమే ఖాళీగా వుంటా… ఆ టైంలో మాత్రమే ప్రేమించుకుందాం అని కండీషన్ పెట్టేసి… హీరోతో ప్రేమ వ్యవహారం నడిపే ఓ పద్ధతి గల అమ్మాయి స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా కథ.. కథనాలన్నీ ఫీల్ గుడ్ గానే వున్నాయి. ఎక్కడా బోరింగ్ లేకుండా… ప్రేక్షకులను కట్టిపడేసే కథ.. కథనాలు… వాటికి తోడు చక్కటి సంభాషణలు రాసుకోవడంతో సినిమాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. పాటల్లో లిప్ లాక్ లు బాగా వుండటంతో… యూత్ బాగా కనెక్ట్ అయిపోతారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఆదిత్య గా శ్రీ పవర్ మంచి నాటనని కనబరిచాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకున్నాడు శ్రీ పవర్. ఇది తన మొదటి సినిమా అయినా ఎక్కడేగాని మొదటి సినిమా నటుడు అనిపించేలా నటించలేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో చెప్పే డైలాగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ కథకి బలం హీరోయిన్ కథ మొత్తం ఆమె చుటే తిరుగుతుంది. ఈ క్యారెక్టర్ కి కృతి గర్గ్ తప్పా వేరే వాళ్ళు ఎవరు చేయలేరు ఆనంతగా ఆమె జీవించింది. ఎమోషనల్ సీన్స్ లో హీరో తో సమానంగా తన నటనను కనబరిచింది. ఇద్దరి మధ్య రొమాన్స్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇక దొంగ క్యారెక్టర్ వేసిన అశోక్ కథ మొత్తాన్ని నడిపిస్తాడు. తన కామెడీ రోల్ తో అక్కడఅక్కడ బాగా నవ్వించాడు. ఇక మిగతా క్యారెక్టర్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఈ సినిమాకు హీరో ఏ దర్శకుడు కాబట్టి సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకున్నాడు శ్రీ పవర్ ఇదివరకు ఎన్నడూ లేనటువంటి కొత్త కథతో మంచి స్క్రీన్ ప్లే తో ఎక్కడ బోర్ సీన్స్ లేకుండా చాలా చక్కగా సినిమాని తీయడంలో సక్సస్ అయ్యాడు. అటు మంచి నటనతో తో పాటు మంచి దర్శకుడు కూడా అనిపించుకున్నాడు. ముఖ్యంగా లవ్ సీన్స్ యూత్ ను బాగా ఆకట్టుకునేలా తెరకేకించాడు. కొత్త అమ్మాయి అయిన తనలోని నటన మొత్తాన్ని రాబట్టుకోవడం లో దర్శకుడు సఫలం అయ్యాడు. ప్రేమ కథలకు ముఖ్యంగా కావాల్సింది మంచి పాటలు గాయని సింగ్ అందించిన పాటలు కథకు తగట్టు చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ కు తగ్గట్టుగా సీన్స్ ను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ప్రవీణ్ వాల్మీకి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా చూయించారు. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!
ప్లస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
ఫోటోగ్రఫీ
హీరో
హీరోయిన్

మైనస్ పాయింట్స్ :
సీరియస్ గా కథ నడిపించటం
కామెడీ పండకపోవటం

సినిమిర్చి .కామ్ రేటింగ్: 3.25/5