CineMirchi.com
facebook Twitter Google+ YouTube

లావణ్య విత్ లవ్‌బాయ్స్ గీతావిష్కరణ

రాజ్యలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లావణ్య విత్ లవ్‌బాయ్స్. పావని, కిరణ్, యోధ, సాంబ ప్రధాన పాత్రల్లో నటించారు. నర్సింలు పటేల్‌చెట్టి, సి.రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. యశోకృష్ణ బాణీలను అందించిన ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. బిగ్‌సీడీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.రమణాచారి,   రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదలచేశారు. ఆడియోసీడీలను కె.రమణాచారి ఆవిష్కరించారు. తొలి ప్రతిని పరుచూరి గోపాలకృష్ణ స్వీకరించారు. ట్రైలర్‌ను రమణాచారి విడుదలచేశారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఆదుర్తి సుబ్బారావు తేనే మనసులు సినిమాతో కొత్తవారిని పరిచయం చేయకపోతే కృష్ణ చిత్రసీమకు పరిచయమయ్యేవారు కాదు. దాసరి కొత్త నటులు వద్దనుకుంటే మోహన్‌బాబులాంటి ఎందరో ప్రతిభావంతులు  సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకపోయేవారు. తేజ, శేఖర్‌కమ్ములతో పాటు పలువురు దర్శకులు కొత్త తరాన్ని చిత్రసీమలోకి తీసుకువచ్చారు. ఆ ఒరవడిలో వడ్డేపల్లి కృష్ణ చక్కటి కథాంశంతో  నూతన తారలతో చేసిన మంచి చిత్రమిది ..  కథాబలమున్న యువతరంలో ఉత్తేజాన్ని రేకెత్తించే, వారిలో ప్రోత్సహాన్ని నింపే కథాంశాలు తప్పకుండా విజయాన్ని సాధిస్తాయి. లలిత గీతాలపై పరిశోధన చేసి డాక్టరేట్‌ను పొందిన వడ్డేపల్లి కృష్ణ సంకల్పం, ధైర్యమే ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి కారణమైంది. మంచి సినిమాలు తీసే దర్శకులు మరింత మంది చిత్రసీమలోకి రావాలి అని అన్నారు.  వడ్డేపల్లి కృష్ణ తపన, తాపత్రయం, ప్రతిభతో పాటు తనన తాను ఆవిష్కరించుకోవాలనే ఆలోచనతో చేసిన సినిమా ఇదని,  పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ ప్రేమికుల్లో పులకింత ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టే చిత్రమిది. పావనితో పాటు నటీనటులంతా  పోటీపడి నటించారు. వరూధినిని ఉహించుకుంటూ కలల లోకంలో విహరించే ముగ్గురు యువకులు లావణ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ ముగ్గురిలో లావణ్య ఎవరిని పెళ్లిచేసుకుంటుందనేది  ఆసక్తికరంగా ఉంటుంది. పతాక ఘట్టాలు ఉత్కంఠను పంచుతాయి. దర్శకుడిగా నా ద్వితీయ ప్రయత్నం ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంటుందనే నమ్మకముంది. మనసుకు వయసుతో సంబంధం ఉండదు. పాతికేళ్లు వెనక్కి వెళ్లి ఈ సినిమా చేశాను. పెళ్లిచూపులు తరహాలో ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. భక్తి, పేరడీ, డ్యూయెట్‌తో పాటు అన్ని తరహా గీతాలకు స్వరాలను సమకూర్చే అవకాశం దొరికిందని, సంగీత దర్శకుడిగా తనకు మంచి పేరును తెచ్చిపెట్టే చిత్రమిదని యశోకృష్ణ చెప్పారు. మిత్రుడిలోని సృజనాత్మకతను  ప్రోత్సహిస్తూ నిర్మాత ఈ సినిమా తీయడానికి ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి చిన్న నిర్మాతల్ని ప్రోత్సహిస్తే  భవిష్యత్తులో మ్రరిన్ని మంచి చిత్రాలు వస్తాయని, వందలాది మందికి ఉపాధి దొరుకుతుందని నిర్మాత మల్కాపురం శివకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ లక్ష్మణ్, అగ్రోస్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు కిషన్‌రావు, నిర్మాతలు, రాజ్యలక్ష్మి, నర్సింలు పటేల్‌చెట్టి, కిరణ్, సాంబ, ప్రేమలత, తోట.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. 
press note
Tags:

Latest Gallery

Intlo Deyyam Nakem Bhayam Movie Photos
Intlo Deyyam Nakem Bhayam Movie Photos
Netra Movie Photos
Netra Movie Photos
Aditya 369 Movie Photos
Aditya 369 Movie Photos
Kalyan Ram
Kalyan Ram
Ravi Teja Kick 2
Ravi Teja Kick 2
Chiranjeevi Birthday Photo Shoot
Chiranjeevi Birthday Photo Shoot
4/4/17
4/4/17
Vasavi Reddy Spicy Photos
Vasavi Reddy Spicy Photos
Angana Rai Photos
Angana Rai Photos
Akkineni Akhil Engagement Photos
Akkineni Akhil Engagement Photos
Gowthami Putra Sarkar Shooting Set Photos
Gowthami Putra Sarkar Shooting Set Photos
Poorna Launches SR fashion Studio
Poorna Launches SR fashion Studio
Latest News
సరోవరం సినిమా టీజర్ లాంచ్'వైశాఖం` చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు - డైన‌మిక్ లేడీ డైరెక్ట‌ర్ జ‌య‌.బి#NBK102, Nayantara, KS Ravikumar, C Kalyan Film First Schedule Details  ఆగస్ట్ 3 నుంచి బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !!"Thanks To Everyone Who Made 'Vaisakham' A Big Success" - Dynamic Lady Director Jaya.Bఆగస్టు 4న దర్శకుడు వచ్చేస్తున్నాడు! Anando Brahma Overseas by Nirvana Cinemasఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా సినిమాదండుపాళ్యం2  మూవీ రివ్యూ  ఆగస్ట్‌ 4న రొమాంటిక్‌ హర్రర్‌ 'ఇది పెద్ద సైతాన్‌' రిలీజ్ కి సిద్ధంగా రాధావరం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న `నాకు నేనే తోపు తురుమ్   విజయవాడలో ఘనంగా జరిగిన 'నిన్నుకోరి' బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ దర్శకుడు గీతావిష్కరణNani’s Krishnarjuna Yudham under Shine Screens banner

This is the tool tip box