CineMirchi.com
facebook Twitter Google+ YouTube

"7 టు 4" టీజర్ లాంచ్ !!

యువ ప్రతిభాశాలి "విజయ్ శేఖర్ సంక్రాంతి" దర్శక నిర్మాతగా పరిచయమవుతూ రూపొందిస్తున్న చిత్రం "7 టు 4".  "మిల్క్ మూవీస్-మినర్వా టాకీస్" ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇ.బాలు నాయక్-కె.రమేష్ సహ నిర్మాతలు. ఆనంద్ బచ్చు, రాధిక, లౌక్య, రాజ్ బాల, పి. బి. శ్రీనివాస్, మలిఖార్జున్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రధారులు. శ్రీమతి స్నేహలతామురళి  సంగీత సారధ్యం వహిస్తున్న ఈ వినూత్న కథా చిత్రానికి శ్రీమతి ద్విభాష్యం శ్రీలక్ష్మీ వందన సాహిత్యం సమకూర్చారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస ఎమ్.ఎల్. సి. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రముఖ నిర్మాతలు వల్లూరిపల్లి రమేష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణలతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. "ఈ చిత్రం ఇతివృత్తం తనకు తెలుసని. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న తన మిత్రుడు బాలు నాయక్ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకడని ఎమ్. ఎల్. సి. రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి తన వైపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. "7 టు 4" చిత్రం ద్వారా ఇద్దరు మహిళలను.. ఒకరిని సంగీత దర్శకురాలిగా, మరొకరిని గీత రచయిత్రిగా పరిచయం చేస్తుండడం అభినందనీయమని" వల్లూరిపల్లి రమేష్ అన్నారు.  
"7 టు 4" టీజర్ చూస్తుంటే తనకు చిరంజీవిగారి "టాగూర్" గుర్తుకువచ్చిందని.. దర్శకుడిగా విజయ్ శేఖర్ కి ఉజ్వలమైన భవిష్యత్ ఉందనిపిస్తోందని రామ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. గీత రచయిత్రిగా తాను పరిచయమవుతున్న చిత్రంలో..  ఉష ఉతుప్ వంటి సుప్రసిద్ధ గాయనీమణి ఓ పాటను ఆలపిచడం తనకు చాలా థ్రిల్లింగ్ గానూ, గర్వంగానూ  ఉందని శ్రీమతి శ్రీలక్ష్మి వందన అన్నారు. లక్ష్మీ వందన సాహిత్యం, ఉషా ఉతుప్ గాత్రం "7 టు 4" చిత్రానికి ప్రత్యెక ఆకర్షణలని.. దర్శక నిర్మాత విజయ్ శేఖర్  పూర్తి  ఫ్రీడం ఇవ్వడంతో.. ఈ చిత్రానికి ఆర్. ఆర్ కూడా తనే సమకూర్చానని శ్రీమతి స్నేహలతామురళి పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల లౌక్య, రాజ్ బాల, పి.బి. శ్రీనివాస్, మల్లి ఆనందం వ్యక్తం చేసారు. తన మిత్రులు, టీం మెంబర్స్ సహకారంతో "7 టు 4" చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా తీర్చిదిద్దగలిగానని విజయ్ శేఖర్ అన్నారు. ఈ చిత్ర ముఖ్య పాత్రధారి ఆనంద్ బచ్చు, తన మిత్రులు  బాలు నాయక్, కె.రమేష్,  మ్యూజిక్ డైరెక్టర్  శ్రీమతి స్నేహలతామురళి, లిరిక్ రైటర్ లక్ష్మీ వందనల సహకారం లేకుంటే.. ఈ చిత్రం ఇంత బాగా వచ్చి ఉండేది కాదని చెప్పిన విజయ్ శేఖర్.. ఈ సందర్భంగా  పేరు పేరునా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 
శ్రీకాంత్, ప్రవీణ్, నివాస్, భరత్, కిరణ్, నితేష్, కార్తిక్, అనుష్, వెన్నెల, దివ్య, చిన్ననేత ఇతర ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి.. డిజైనింగ్: గణేష్ రత్నం, కో-డైరెక్టర్: గిరీష్, పోస్ట్ ప్రొడక్షన్ చీఫ్: వి.ఉపేంద్ర, రచనాసహకారం: శ్రీకాంత్-రాజేష్-చంద్రశేఖర్, సాహిత్యం: శ్రీమతి ద్విభాష్యం శ్రీలక్ష్మీ వందన, సంగీతం: శ్రీమతి స్నేహలతామురళి, కెమెరామెన్: ఇ. కె. ప్రభాత్-చిరంజీవి, ఎడిటర్:  సత్య గిడుతూరి,  సహ నిర్మాతలు: ఇ. బాలు నాయక్-కె.రమేష్, కథ-స్క్రీన్ ప్లే-సంభాషణలు-నిర్మాణం-దర్సకత్వం: విజయ్ శేఖర్ సంక్రాంతి!!  
 
source by : pressnote 
Tags:

Latest Gallery

Intlo Deyyam Nakem Bhayam Movie Photos
Intlo Deyyam Nakem Bhayam Movie Photos
Netra Movie Photos
Netra Movie Photos
Aditya 369 Movie Photos
Aditya 369 Movie Photos
Kalyan Ram
Kalyan Ram
Ravi Teja Kick 2
Ravi Teja Kick 2
Chiranjeevi Birthday Photo Shoot
Chiranjeevi Birthday Photo Shoot
Vasavi Reddy Spicy Photos
Vasavi Reddy Spicy Photos
Angana Rai Photos
Angana Rai Photos
Deeksha Panth
Deeksha Panth
Akkineni Akhil Engagement Photos
Akkineni Akhil Engagement Photos
Gowthami Putra Sarkar Shooting Set Photos
Gowthami Putra Sarkar Shooting Set Photos
Poorna Launches SR fashion Studio
Poorna Launches SR fashion Studio
Latest News
మాజి క్రికెట‌ర్ శ్రీశాంత్‌, నిక్కి గ‌ల్రాని "టీమ్‌5" టీజ‌ర్ రిలీజ్‌యూత్‌స్టార్‌ నితిన్‌ బర్త్‌డే సందర్భంగా హను రాఘవపూడి, 14 రీల్స్‌ భారీ చిత్రం 'లై' ఫస్ట్‌ లుక్‌ విడుదల Sriwass Launched Sekharam Gari Abbayi Motion Posterశ్రీ‌వాస్ చేతుల‌మీదుగా `శేఖరం గారి అబ్బాయ్` మోష‌న్ పోస్ట‌ర్‌Konijeti Rosaiah Launched Upendra-Priyamani Kalpana 3 Posterశ్రీ కొణిజేటి రోశ‌య్య ఆవిష్క‌ర‌ణ‌లో `క‌ల్ప‌నా 3` పోస్ట‌ర్‌Jagapathi Babu, Vaaraahi Chalana Chitram Production No 11 Patel S.I.R Opening!మార్చి 31న `సినీ మహల్`శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న‌ `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` అందగాడు మే 26 న రిలీజ్ Raj Tarun’s ‘Andhhagadu’ to Release on May 26thశరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న నాగచైతన్య, అన్నపూర్ణ స్టూడియోస్‌ చిత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం' నాగ‌శౌర్య హీరోగా త‌న సొంత బ్యాన‌ర్ ఐరా క్రియోష‌న్స్ లో ర‌ష్మిక మండ‌న్న‌ జంట‌గా చిత్రం ఏప్రిల్ 10న ప్రారంభంరక్షక భటుడు ట్రైలర్ లాంచ్ గంటా రవి హీరోగా జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం పేరు 'జయదేవ్‌' 

This is the tool tip box